Diwali Clash : దీపావళికి మాజీ మామతో పోటీ పడుతున్న అల్లుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పండుగ సీజన్ల వేళ స్టార్ హీరోల చిత్రాలు పోటీ పడటం సర్వసాధారణం. అయితే ఈ ఏడాది కోలీవుడ్ దీపావళి రేసు మాత్రం అత్యంత ప్రత్యేకంగా మారబోతోంది. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు వర్సటైల్ స్టార్స్, ఒకప్పటి మామ-అల్లుళ్లు అయిన సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో వస్తున్న ‘జైలర్ 2’ మరియు ధనుష్ మైల్స్టోన్ చిత్రం ఒకే సీజన్లో తలపడనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.
నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ బ్లాక్‌బస్టర్ హిట్‌కు సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్ 2‘ పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ ఇప్పటికే దాదాపు చివరి దశకు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగవంతం చేసి ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. మరోవైపు వరుస విజయాలతో దూసుకుపోతున్న రజనీకాంత్ మాజీ అల్లుడు, నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్ కూడా స్పీడ్ పెంచారు. ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం ‘ధనుష్ 55‘. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా దీపావళి టార్గెట్‌గానే రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు. రజనీకాంత్ వర్సెస్ ధనుష్ అనగానే అభిమానుల్లోనే కాకుండా ట్రేడ్ వర్గాల్లోనూ క్యూరియాసిటీ నెలకొంది. ఒకవైపు ‘జైలర్ 2’ బ్రాండ్ ఇమేజ్.. మరోవైపు ధనుష్ కంటెంట్ ఓరియెంటెడ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఈ దీపావళి రేసులో మామ-మాజీ అల్లుళ్లలో బాక్సాఫీస్ విజేతగా ఎవరు నిలుస్తారో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!