NTV Telugu Site icon

Rajinikanth : రజనీకాంత్ హెల్త్ బులిటెన్ విడుదల

Rajinikanth

Rajinikanth

Rajinikanth Health Bulletin: నిన్న సెప్టెంబర్ 30న అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన సూపర్ స్టార్ రజనీకాంత్ వెంటనే చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. రజనీకాంత్ అక్కడ చికిత్స పొందుతున్నప్పుడు, పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడని ఆసుపత్రి అధికారులు తెలిపారు. అయితే ఇప్పుడు అపోలో హాస్పిటల్స్ రజనీకాంత్ ఆరోగ్యంపై ఒక బులెటిన్ విడుదల చేసింది. ఇది రజనీకాంత్ అభిమానులకు ఉపశమనం కలిగించింది. ప్రస్తుతం చెన్నైలో అపోలో ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్ పరిస్థితిపై ప్రకటన విడుదల చేసింది అపోలో సంస్థ.. ‘రజనీకాంత్‌ను నిన్న సెప్టెంబర్ 30న అపోలో ఆసుపత్రిలో చేర్చారు. గుండెకు వెళ్లే రక్తనాళంలో వాపు వచ్చింది.

Vanitha: నాలుగో పెళ్ళికి సిద్దమైన హీరోయిన్

కానీ శస్త్రచికిత్స లేకుండా వాపు పూర్తిగా క్లియర్ చేయబడింది. “మేము ఊహించిన విధంగా ఆయన పరిస్థితి చాలా నిలకడగా ఉంది. ఆయన పూర్తి ఆరోగ్యంతో త్వరలో తిరిగి మామూలు మనిషి అవుతారు. ఆయన రెండు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి” అని అపోలో ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ 45 ఏళ్లకు పైగా తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 2023లో విడుదలైన ఆయన చిత్రం “జైలర్” ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 640 కోట్ల రూపాయలను వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత ఏ తమిళ సినిమా కూడా ఆ రికార్డును బ్రేక్ చేయకపోవడం కూడా గమనార్హం.

Show comments