సూపర్‌స్టార్ రజినీకాంత్ కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిన చిత్రం ‘భాషా’. 1995లో వచ్చిన ఈ మాస్ యాక్షన్ డ్రామా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ చేయాలన్న ఆలోచనతో ఓ తెలుగు దర్శకుడు ముందుకొచ్చిన సంగతి వెలుగులోకి వచ్చింది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన ‘బింబిసార’ చిత్రంతో టాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన డైరెక్టర్ వశిష్ట మల్లిడి, భాషా సీక్వెల్ ప్లాన్ చేసినట్టు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. కథ కూడా సిద్ధమైంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్‌లో రూపొందించాల్సిన ఈ చిత్రానికి రజినీకాంత్ కూడా కథ వినగానే ఆసక్తి చూపారట.
Also Read : Sreeleela : బాలీవుడ్‌లో మరో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల..
అయితే, కథలో కొన్ని లోటులు ఉన్నాయని భావించిన వశిష్ట, ప్రాజెక్ట్‌ను ఆపేసినట్టు వెల్లడించారు. “స్టార్ హీరో, పెద్ద కథ – ఇవన్నీ ఉన్నా, కథ పరంగా నన్ను పూర్తిగా సంతృప్తి పరచలేదు. అందుకే రద్దు చేసుకున్నాను” అంటూ ఆయన పేర్కొన్నారు. ఒక ప్రముఖ స్టార్ నటించాల్సిన, కల్ట్ క్లాసిక్‌కు కొనసాగింపుగా రానున్న చిత్రానికి అవకాశం వచ్చినా, అది తెరపైకి రాకపోవడం అభిమానుల్లో చిన్న నిరాశను కలిగించింది. కానీ వశిష్ట తీసుకున్న ఈ ఛాలెంజింగ్ నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు.
