ఈమధ్య కాలంలో బూతు పదాలతో రెచ్చిపోతున్న రాజేంద్ర ప్రసాద్ తాజాగా ఈ విషయం మీద స్పందించారు. అలీకి ఇబ్బంది లేదు, మా అన్నయ్య నేను పర్సనల్ గా మాట్లాడుకున్న విషయం, దీన్ని మీరెందుకు పెద్దది చేస్తున్నారు అని అడిగాడు. ఎవరో ఏదో అంటే మనం ఏం చేయగలం. ఇక్కడ ఇండస్ట్రీలో హానెస్ట్ గా ప్రేమలు పంచుకోవడమే ఉంటుంది. లేకపోతే ఇన్నేళ్ల నటజీవితం ఎలా ఉంటుంది? అని ప్రశ్నించారు.
Also Read:SSMB 29: కొత్త షెడ్యూల్.. ఎప్పుడు? ఎక్కడ అంటే?
మొన్న జరిగిన పరిణామాలకు హర్ట్ అయ్యాను, ఎంత హార్ట్ అయ్యాను అంటే జీవితంలో ఇంకెవరినీ, ఎప్పుడూ ఏకవచనంతో పిలవకూడదు అని నిర్ణయం తీసుకున్నాను.. ఇక మీదట అందరినీ బహువచనంతోనే పిలుస్తాను. అలా పిలవడం మా అన్నగారు(ఎన్టీఆర్) దగ్గర నేర్చుకున్నాను. ఈ క్షణం నుంచి నా చివరి శ్వాస వరకు అందరికీ మర్యాద ఇచ్చే మాట్లాడతాను. ఇదే నా పనా, నా పని నాకు ఉంది. ఎవరో ఎదో పని లేని వాళ్ళు ఏదో చేశారని నేనేదో చేస్తూ కూర్చోలేను.
Also Read:RT 76: రవితేజతో డిజాస్టర్ కొట్టిన నిర్మాత మరో సినిమా.. రేపే ఓపెనింగ్
ఇప్పటివరకు నేను మాట్లాడిన అందరూ నాకు ఎంతో ఆత్మీయులు అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మొన్న బర్త్ డే ఫంక్షన్లో కెమెరాలు ఉన్నాయని తెలియదు. వాళ్ళందరూ నాతో పనిచేసిన వాళ్ళే, నేను ఫిల్టర్ లేకుండా అన్నాను, తరువాత మీడియా కవర్డ్ ఈవెంట్ అని తెలిసి బాధ పడ్డాను. డేవిడ్ వార్నర్ విషయంలో కూడా నేను, ఆయన సహా నితిన్, శ్రీ లీల అందరూ కలిసి అల్లరి చేసి బయటకు వచ్చాం. ఆ సమయంలో చనువు కొద్దీ ఆ పిలుపు వచ్చేసింది అని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.
