NTV Telugu Site icon

Rajendra Prasad: ‘రాబిన్ హుడ్’తో నితిన్ రేంజ్ మారుతుంది.. భలే గమ్మత్తుగా ఉంటుంది!

Rajendra Prasad Interview

Rajendra Prasad Interview

హీరో నితిన్ కామెడీ ఎంటర్ టైనర్ రాబిన్‌హుడ్లో శ్రీ లీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపధ్యంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ విలేకరుల సమావేశంలో రాబిన్‌హుడ్ విశేషాలు పంచుకున్నారు.

రాబిన్‌హుడ్ జర్నీ గురించి చెప్పండి ?
-సినిమా ఇండస్ట్రీకి వచ్చి 48 ఏళ్ళు అయ్యింది. రాబిన్‌హుడ్ చేశాక యాక్టర్ గా నామీద నాకు కాన్ఫిడెన్స్ లెవల్ పెరిగింది. రాబిన్‌హుడ్ చూసాక నేను హీరోగా చేసిన ఎంటర్ టైనింగ్ సినిమాలు, ఆనాటి రోజులు ఆడియన్స్ కి గుర్తుకు వస్తాయి. క్యారెక్టర్, పెర్ఫార్మెన్స్ పరంగా సినిమా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. దర్శకుడు వెంకీ అద్భుతంగా రాశాడు, తీశాడు. నేను హీరోగా నటించిన పాత రోజులు మళ్ళీ గుర్తుకు వచ్చాయి. ఈ సినిమా, క్యారెక్టర్ పట్ల చాలా హ్యాపీగా వుంది.

రాబిన్‌హుడ్ లో నితిన్ తో కెమిస్ట్రీ ఎలా వుంటుంది ?
-ఇందులో ఇండియాలోనే హయ్యెస్ట్ సెక్యూరిటీ ఏజెన్సీ నాది. నా ఏజెన్సీలో పని చేయడానికి హీరో వస్తాడు. ఇంతకంటే కథ చెప్పకూడదు. ఈ కాంబినేషన్ లో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో నా టైమింగ్ నితిన్ ఫాలో అవ్వాలి, నితిన్ టైమింగ్ నేను ఫాలో అవ్వాలి. క్యారెక్టర్స్ అలా డిజైన్ చేయబడ్డాయి. మేము ఇద్దరం వెన్నెల కిశోర్ కి దొరక్కూడదు. సినిమా చూసినప్పుడు భలే గమ్మత్తుగా వుంటుంది. ఇలాంటి ఎంటర్ టైనింగ్ సినిమా చేసి చాలా కాలమైయింది. రాబిన్‌హుడ్ ఆడియన్స్ కి మంచి ఫీస్ట్. జులాయి దగ్గర నుంచి వందకోట్ల దాటిన కమర్షియల్ సినిమాలు చాలా చేశాను. నితిన్ కి రాబిన్‌హుడ్ సినిమాతో స్టేచర్ మారబోతోంది. ఒకవేళ మారకపోతే ఇంకెప్పుడూ నా ఒపీనియన్ చెప్పను.

డైరెక్టర్ వెంకీ కుడుముల గురించి?
-వెంకీ కుడుముల చాలా బిగ్ డైరెక్టర్ అవుతారు. ఈ మధ్య కాలంలో వన్ అఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ రాబిన్‌హుడ్ లో చేశాను. డైరెక్టర్ వెంకీ స్పెషల్ గా ఈ క్యారెక్టర్ ని నా గురించి రాసుకున్నారు. వర్క్ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా ఇది. వెంకీ, త్రివిక్రమ్ దగ్గర అసిస్టెంట్ గా చేశారు. ఆయన లక్షణాలు అన్నీ వచ్చాయి. డైలాగ్ లో మంచి పంచ్ ఉంటుంది. తను కథ చెప్పినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. జులాయి తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, నాన్నకు ప్రేమతో, శ్రీమంతుడు, ఓ బేబీ, ఎఫ్2 చిత్రాల్లో నా పాత్రలని ఎలా అయితే గుర్తుపెట్టుకున్నారో.. రాబిన్‌హుడ్ లో చేసిన క్యారెక్టర్ కూడా నేను గ్యారెంటీగా గుర్తుపెట్టుకునే క్యారెక్టర్ అవుతుంది. నటుడిగా ఈ జీవితం దేవుడు, ప్రేక్షకులు ఇచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. లేడిస్ టైలర్, ఏప్రిల్ ఒకటి విడుదల, మిస్టర్ పెళ్ళాం,పెళ్లి పుస్తకం, ఆ ఒక్కటీ అడక్కు.. ఇలా ప్రతి సినిమా దేనికదే భిన్నంగా వుంటుంది. డిఫరెంట్ క్యారెక్టర్స్ కనిపిస్తాయి. ఒకే ఏడాది హీరోగా 12 సినిమాలు రిలీజ్ చేసిన రోజులున్నాయి. దాదాపు ఆ సినిమాలన్నీ మనం రిలేట్ చేసుకునే పాత్రలే. అందుకే ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యానని అనుకుంటాను. నాటి ప్రధాని పీవీ నరసింహారావు గారు దగ్గర నుంచి ఇప్పటికీ చాలా మంది ప్రేక్షకులు జీవితంలో ఒత్తిడి, నిరాశలో వున్నప్పుడు సరదాగా నవ్వుకోవడానికి, మనసు తేలిక అవడానికి నా సినిమాలు చూస్తుంటామని చెప్పడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పటికీ దర్శకులు నా కోసం ప్రత్యేకంగా పాత్రలు రాయడం నా అదృష్టం. రాబిన్‌హుడ్ సినిమా చూసినప్పుడు ఆ స్పెషాలిటీ మీరు ఫీలౌతారు.

రాబిన్‌హుడ్ లో శ్రీలీల క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది?
-శ్రీలీల చాలా మంచి సినిమాలు చేస్తోంది. చాలా మెచ్యూర్ యాక్టర్ గా కనిపించింది. ఇందులో ఆమె బిహేవియర్ నాకు చాలా నచ్చింది. ఇందులో ఫారిన్ నుంచి వచ్చిన తనకి సెక్యురిటీ ఇచ్చే బాధ్యత మాది. చాలా సరదాగా ఉంటుంది. మైత్రి మూవీ మేకర్స్ తో శ్రీమంతుడు సినిమా నుంచి నాకు మంచి అనుబంధం ఉంది. సినిమా అంటే చాలా పాషన్ వున్న నిర్మాతలు. వారితో కలసి పని చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్.