Site icon NTV Telugu

Anushka: అనుష్క హోటల్ ముందు 1500 మంది పడిగాపులు కాసేవాళ్ళు !

Anushka

Anushka

అనుష్క క్రేజ్ గురించి ఘాటి సినిమా నిర్మాత రాజీవ్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అనుష్క ప్రధాన పాత్రలో, క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఘాటి సినిమా సెప్టెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఒక పక్క దర్శకుడు తో పాటు, మరోపక్క నిర్మాతలు కూడా గట్టిగానే సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా నిర్మాతలలో ఒకరైన రాజీవ్ రెడ్డి హైదరాబాదులో ప్రింట్ అండ్ వెబ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అనుష్క క్రేజ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, సినిమా మొదలు పెట్టే సమయంలో అనుష్క క్రేజ్ గురించి మేము పెద్దగా ఆలోచించలేదు, కానీ ఎప్పుడైతే సినిమా షూటింగ్ మొదలు పెట్టామో, అప్పుడే మాకు ఈ సినిమా స్పాన్ ఏంటో అర్థం అయిపోయింది అంటూ కామెంట్ చేశారు.

Also Read : Nara Rohith: నేనూ పవన్ లాగే.. పాలిటిక్స్ పై నారా రోహిత్ షాకింగ్ కామెంట్స్

ఆయన మాట్లాడుతూ, ఈ సినిమా షూటింగ్ ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లోని మారుమూల కొండ ప్రాంతాలలో చేశామని, అక్కడ తమకు ఆసక్తికరమైన అనుభవాలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ, అనుష్క షూటింగ్ కోసం వచ్చి స్టే చేసిన హోటల్ బయట వెయ్యి మంది ఉదయాన్నే పోగై ఉండేవారు. సాయంత్రం సినిమా షూటింగ్ ముగించుకుని వచ్చే సమయానికి 1000 నుంచి 1500 మంది వరకు పోగయ్యి, అనుష్కను చూసేందుకు ఆసక్తి కనబరుస్తూ ఉండేవారు. ఇదంతా నేను చెప్పేది ఆంధ్ర, ఒడిశా సరిహద్దులోని ఒక రిమోట్ గ్రామం సంగతి. అక్కడే పరిస్థితి ఇలా ఉంటే, ఇంకా వేరే ప్రాంతాలలో ఆమెకున్న క్రేజ్ ఎలాంటిదో మీరు అర్థం చేసుకోవచ్చు అంటూ రాజీవ్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇక రాజీవ్ రెడ్డి స్వయంగా డైరెక్టర్ క్రిష్‌కి స్నేహితుడు. క్రిష్‌తో కలిసి ఆయన వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు. గమ్యంతో మొదలుపెట్టి ఘాటి వరకు ఆయన క్రిష్‌తోనే ప్రయాణం చేస్తున్నారు.

Exit mobile version