Site icon NTV Telugu

Rajamouli: రాజమౌళికి కొత్త కష్టం ?

Ss Rajamouli

Ss Rajamouli

మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి సినిమా టైటిల్ ఫిక్స్ చేయలేదు కాబట్టి ఎస్ ఎస్ ఎం బి 29 అని ప్రస్తావిస్తున్నారు. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్మించిన ప్రత్యేకమైన సెట్స్ లో ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరకు జరిగింది. అసలు సినిమా సెట్స్ నుంచి ఒక్క ఫోటో కూడా బయటకు లీక్ కాకుండా రాజమౌళి అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇక ప్రస్తుతానికి ఈ ఇండోర్ షూటింగ్ పూర్తయింది సినిమా యూనిట్ అంతా అవుట్డోర్ షూటింగ్ కోసం ఒడిస్సాలోని ఈస్ట్రన్ ఘాట్స్ కు పయనమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

BNS Srinivas: తెలుగు వారి కోసం ప్రపంచ నిపుణుల జ్ఞానాన్ని అందిస్తున్న మార్గదర్శి

అక్కడ కొన్ని రోజుల పాటు సినిమా షూటింగ్ జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇండియానా జోన్స్ తరహాలో సాగే ఈ కథలో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు రాజమౌళి. సినిమా షూటింగ్ సహా సినిమా అప్డేట్స్ కూడా బయటికి వెళ్లకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. దానికి తగ్గట్టు అగ్రిమెంట్స్ కూడా చేయించాడు. అయితే ఇన్ డోర్ కాబట్టి ఇప్పటిదాకా టెన్షన్ లేదు కానీ ఇప్పుడు అవుట్ డోర్ కాబట్టి అది కాస్త ఇబ్బందికర అంశమే. ఇక ఇప్పుడు సినిమా షూటింగ్ అవుట్డోర్ కి షిఫ్ట్ అవుతూ ఉండడంతో ఆ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోబోతున్నాడు అనేది చూడాల్సి ఉంది.

Exit mobile version