రాజమౌళి ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్ కోసం సోషల్ మీడియాలో ఇప్పటికే పెద్ద హంగామా మొదలైంది. నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోయే ఈ విజువల్ స్పెక్టకుల్‌పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే, ఇటీవల వచ్చిన పోలీస్ గైడ్‌లైన్స్ వల్ల ఈ ఈవెంట్ ఓపెన్ ఏరియాలో కాదు.. ఎంట్రీ చాలా పరిమితంగా ఉంటుందని రాజమౌళి స్వయంగా చెప్పడంతో, అందరి మైండ్‌లో ఒక్కటే ప్రశ్న“అయితే ఈవెంట్‌కి ఎంట్రీ ఎలా?” అలా. సాధారణంగా ఇలాంటి పెద్ద ఈవెంట్లలో ఎంట్రీ పాస్‌లు ఇస్తారు. కానీ ఈసారి జక్కన్న టీమ్ నుంచి పాస్‌ల గురించిన చర్చ పెద్దగా వినిపించలేదు. ఎందుకంటే రాజమౌళి ఈసారి పాస్ సిస్టమ్‌ను పక్కన పెట్టేసి, అతని స్టైల్‌కే తగ్గట్టు మరింత క్రియేటివ్ ఐడియా తీసుకొచ్చారు. ఏంటీ అంటే ఈవెంట్‌లోకి వెళ్లాలంటే పాస్ కాదు, ‘పాస్‌పోర్ట్’ కావాలి!
Also Read : OTT ‘TIBIDI’ : నెలకు 10 రూపాయల ఫీతో కొత్త ఓటీటీ లాంఛ్..
అవును.. ‘గ్లోబ్ ట్రాటర్’ కాన్సెప్ట్‌కి అనుగుణంగా, ఎంట్రీ పాస్‌ను పాస్‌పోర్ట్ రూపంలో డిజైన్ చేసి టీమ్ పంపిణీ చేస్తోంది. ఇది నిజమైన ప్రభుత్వం ఇచ్చే పాస్‌పోర్ట్ కాదు; ఈవెంట్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన థీమ్ ఇన్విటేషన్. పసుపు రంగు కవర్‌తో, అసలు పాస్‌పోర్ట్‌లా కనిపించేలా రూపొందించిన ఈ ప్రత్యేక పాస్‌పోర్ట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై “GLOBETROTTER EVENT – PASSPORT” అని ప్రింట్ చేసి ఉంది. లోపల ఈవెంట్ వివరాలు, అలాగే మహేష్ బాబు లుక్‌కి సంబంధించిన విజువల్స్ కూడా ఉన్నాయి. క్రియేటివిటీ + స్ట్రాటజీ కలిపితే జక్కన్న స్టైల్ అని మనకు తెలిసిందే. ఈ ఐడియా వెనుక కేవలం క్రియేటివిటీ మాత్రమే కాదు.. పక్కా ప్లానింగ్ కూడా ఉంది. పోలీసులు భద్రతా కారణాల వల్ల జనాన్ని పరిమితంగా అనుమతించాలని సూచించడంతో, రాజమౌళి ఆ రూల్‌ను కూడా తన ప్రమోషన్ స్ట్రాటజీగా మార్చేశారు. ‘పాస్‌పోర్ట్’ రూపంలో ఎంట్రీ ఇవ్వడం వల్ల ఈవెంట్‌కు స్పెషల్ ఫీలింగ్ ఏర్పడింది, థీమ్‌కు పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయింది. ఫ్యాన్స్ మాత్రం ఈ క్రియేటివ్ ఎంట్రీ సిస్టమ్ చూసి మామూలుగా కాదు పూర్తిగా ఫిదా..!
Get your passports and fasten your seat belts😉
Coz this journey will be remeMBered forever🔥🦁#Globetrotter #GlobetrotterEvent @urstrulyMahesh pic.twitter.com/b1umKQKJzA— Kukatpally DHFMS (@KukatpallyMBFC) November 13, 2025
