Site icon NTV Telugu

Rajamouli : బాహుబ‌లి మాయాజాలం వెనుక రాజ‌మౌళి కృషి.. జక్కన్న స్పెషల్ బ‌ర్త్‌డే వీడియో!

Shah Rukh Khan Injury

Shah Rukh Khan Injury

తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ద‌ర్శకుల్లో ఎప్పటికీ మొదటి స్థానంలో నిలిచే పేరు రాజమౌళిదే. ఈగ, మగధీర, ఆర్ఆర్‌ఆర్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో ప్రేక్షకులను మాయచేసిన జక్కన్న, బాహుబలి సిరీస్‌తో ప్రపంచ సినీ వేదికపై భారతీయ సినిమాకు గర్వకారణంగా నిలిచారు. రెండు భాగాలుగా తెరకెక్కిన ‘బాహుబలి’ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, భారత సినీ చరిత్రలో కొత్త రికార్డులను సృష్టించింది. ఈ సినిమా విడుదలై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మేకర్స్‌ భారీ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు. అక్టోబర్‌ 31న బాహుబలి రెండు భాగాలను కలిపి ఒకే సినిమాలోగా మళ్లీ థియేటర్లలో రీ–రిలీజ్ చేయబోతున్నారు.

Also Read : Bunnyvasu : ‘మిత్ర మండలి’ ప్రమోషన్ వేడుకలో.. బండ్ల గణేష్ బన్నీవాసు ఘర్షణ?

ఇదే సమయంలో నేడు రాజమౌళి పుట్టినరోజు కావడంతో బాహుబలి టీమ్‌ ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపింది. అందులో భాగంగా ఒక స్పెషల్‌ బర్త్‌డే వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో రాజమౌళి బాహుబలిని ప్రపంచ స్థాయి సినిమాగా మలచడానికి చేసిన కృషి, శ్రమ స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా బిజ్జల దేవా పాత్ర మేకింగ్ సీన్, యాక్షన్ సీక్వెన్స్ లో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి రాజమౌళి పట్ల అభిమానులు, సినీ ప్రముఖులు తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 

Exit mobile version