NTV Telugu Site icon

Raja Saab: రాజా సాబ్.. ఇంకా లేటా?

The Rajasaab Motion Poster

The Rajasaab Motion Poster

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల లైనప్ చూస్తే దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ కావాల్సిందే. రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్‌తో పాటు హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై మూడు సినిమాలు, కల్కి సీక్వెల్ ప్రజెంట్ అఫీషియల్ కన్పర్మేషన్ లిస్టులో ఉన్నాయి. ఇవే కాకుండా కన్నప్పలో క్యామియో రోల్ చేస్తున్నాడు. అలాగే ప్రశాంత్ వర్మ, లోకేశ్ కనగరాజ్ ప్రాజెక్టులకు ఓకే చెప్పడని టాక్. సెలక్టివ్‌గా సినిమాలు చేయడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా చేస్తున్న డార్లింగ్.. సినిమాల రిలీజెస్ విషయంలో మాత్రం హర్ట్ చేస్తున్నాడు.

Thug Life: థగ్ లైఫ్ కోసం ఇంత పెట్టడానికి రెడీ అయ్యారా?

సంక్రాంతికి డార్లింగ్ డై హార్డ్ అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చింది రాజా సాబ్ యూనిట్. ప్రభాస్ లుక్ రివీల్ చేసింది. ఈ లుక్ చూసి డార్లింగ్ ఈజ్ బ్యాక్ అనుకునే లోపు.. పోస్టర్‌పై రిలీజ్ డేట్ స్కిప్ చేసింది. దీంతో ఏప్రిల్ 10న సినిమా రాదు అనే ఊహాగానాలకు బలాన్నిచ్చినట్లయ్యింది. షూటింగ్ కంప్లీట్ కాలేదా అంటే.. ప్యాకప్ చెప్పిసినట్లు ఓ ఈవెంట్‌లో డైరెక్టర్ మారుతినే స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. మరీ రీసెంట్ పోస్టర్‌పై రిలీజ్ డేట్ లేకపోవడంతో మారుతిపై ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడయ్యా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఏదైతే ఎక్స్ పెక్ట్ చేస్తున్నారో దానికి మించి వన్ పర్సెంట్ ఎక్కువే ఇస్తానని మారుతి గతంలోనే చెప్పాడు. ఇప్పుడు ఆ ప్రామిస్ నిలబెట్టుకునేందుకు గట్టిగానే ట్రై చేస్తున్నట్లు కనిపిస్తుంది. విజువల్ వండర్‌గా సినిమాను తీసుకువచ్చేందుకే బాగా కష్టపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే సినిమా వాయిదా పడుతున్నట్లు టాక్. ఫస్ట్ టైం ప్రభాస్.. హారర్ కామెడీ జోనర్ చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రాజా సాబ్ విషయంలోనే కాదు..ప్రభాస్ యాక్ట్ చేసిన పాస్ట్ కొన్ని మూవీస్ కూడా పోస్ట్ పోన్ అయ్యాయి. ఇదొక సెంటిమెంట్‌లా మారిపోయింది. వర్కౌట్ కూడా అయ్యింది. సలార్, రీసెంట్ హిట్ కల్కి 2898ఏడీ రెండు కూడా అనుకున్న డేట్‌కు రిలీజ్ కాలేదు. కానీ గ్యాప్ తీసుకుని వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు రాజా సాబ్ బొమ్మ కూడా హిట్టే అని ఆనందంలో మునిగిపోతున్నారు. మరీ కొత్త రిలీజ్ డేట్ మారుతి ఎప్పుడు చెబుతాడో..? చూడాలి.