శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్, సునయన హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “రాజ రాజ చోర”. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హసిత్ గోలి దర్శకుడు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ఒక టీజర్ కు మంచి స్పందన వచ్చింది.
Also Read : టాప్ ఈతగాళ్ల లిస్ట్ లో మహేష్ తనయుడు
బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ చేత చెప్పించిన కథ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. రాజు కిరీటాన్ని దొంగలించిన దొంగ, కొంత కాలం రాజసింహాసంపై కూర్చుని, ఆ తర్వాత అసలు రాజు రావడంతో పలాయనం చిత్తగిస్తాడు. తనను మోసం చేసిన ఆ దొంగను పట్టుకోవడానికి రాజు ఏం చేశాడు? చివరకు ఆ దొంగ దొరికాడా, లేదా? అనేదే ఈ చిత్ర కథ అట. “రాజ రాజ చోర” టీజర్ ఈ నెల 18న ఉదయం 10 గంటల 8 నిమిషాలకు విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘తస్మాత్ జాగ్రత్త… చోరుడు వచ్చే సమయం ఆసన్నమైంది…’ అంటూ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్.