Site icon NTV Telugu

Raj Tarun – Malvi : ఎట్టకేలకు మీడియా ముందుకు రాజ్ తరుణ్?

Raj Tarun Lavanya

Raj Tarun Lavanya

Raj Tarun – Malvi to Appear Before Media for Tiragabadarasaami: గత కొంతకాలంగా రాజ్ తరుణ్ ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తనను రహస్యంగా ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు మరొక హీరోయిన్ తో కలిసి తిరుగుతున్నాడు అంటూ లావణ్య అనే యువతి పోలీసులను ఆశ్రయించింది. అయితే లావణ్య తనను ఇబ్బంది పెడుతోంది అంటూ రాజ్ తరుణ్ తో తిరగబడరాసామి అనే సినిమా చేసిన మాల్వి మల్హోత్రా కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరొకపక్క రాజ్ తరుణ్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే లావణ్య ఆధారాలు సమర్పించడంతో రాజ్ పోలీసులు విచారణకు రావాల్సిందిగా కోరారు. అయితే తాను ఇప్పట్లో రాలేనని పోలీసులకు రాజ్ తరుణ్ సమాధానం ఇచ్చాడు. అయితే ఇప్పుడు రాజ్ తరుణ్ మీడియా ముందుకు ఈ వివాదం తర్వాత మొట్టమొదటిసారిగా రాబోతున్నట్లు తెలుస్తోంది. రాజ్ తరుణ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయంలో మీడియాతో మాట్లాడాడు. ఆ తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.

Also Read:Healthy Lifestyle : నాజూకుగా ఉండాలంటే వీటిని తింటే సరిపోతుందా..

గత శుక్రవారం నాడు రాజ్ తరుణ్ హీరోగా నటించిన పురుషోత్తముడు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ కి రాజ్ తరుణ్ వస్తాడని భావించారు కానీ ఆయన అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన తిరగబడరా సామి అనే సినిమా రిలీజ్ అవుతోంది. మరో ఐదు చిన్న సినిమాలు తో పాటు ఈ సినిమా ఆగస్టు రెండో తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కైనా రాజ్ తరుణ్ వస్తాడా? రాడా? అనే అనుమానాల మధ్య రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాలతో కలిసి ఈ సినిమా ప్రమోషన్స్ కి వస్తున్నట్టు మేకర్స్ నుంచి లీకులు అందాయి. అయితే పురుషోత్తముడు ప్రమోషన్స్ సమయంలో కూడా మేకర్స్ అదే విధంగా రాజ్ తరుణ్ వస్తున్నాడని పేర్కొన్నారు. కాబట్టి తిరగబడరా సామి ప్రెస్ మీట్ కి వచ్చేవరకు అది అనుమానం అనే చెప్పాలి.

Exit mobile version