Site icon NTV Telugu

Raj Tarun: అజ్ఞాతం వీడిన “పురుషోత్తముడు”.. దర్శకుడికి ఫోన్!

Purushothamudu Review

Purushothamudu Review

Raj Tarun Called Director after Purushottamudu getting Positive Reports: రాజ్ తరుణ్ హీరోగా నటించిన కొత్త సినిమా “పురుషోత్తముడు”. రామ్ భీమన “పురుషోత్తముడు” సినిమాను రూపొందించారు. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముఖేష్ ఖన్నా వంటి స్టార్ కాస్టింగ్ తో రూపొందిన ఈ సినిమా నిన్న శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయింది. ఈ చిత్రాన్ని శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించగా హాసిని సుధీర్ హీరోయిన్ గా పరిచయమయ్యారు. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనే ప్రశంసలు దక్కుతున్న నేపథ్యంలో “పురుషోత్తముడు” సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రామ్ భీమన మాట్లాడుతూ – “పురుషోత్తముడు” సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.

Sunitha Krishnan: బాలీవుడ్ వాళ్లు బయోపిక్ రెడీ చేసినా నేను నో చెప్పా!

మీడియా నుంచి కూడా చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. రాజ్ తరుణ్ ఫోన్ లో మాట్లాడి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు, డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ వంటి అభిరుచి గల ప్రొడ్యూసర్స్ ఉండటం వల్లే “పురుషోత్తముడు” వంటి మూవీ చేయగలిగాం. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ గారి పాత్రలకు మంచి అప్లాజ్ వస్తోంది. పూల రైతుల సమస్యను తెరపై చూపించడం అనేది ఒక కొత్త నేపథ్యం, కొత్త ప్రయత్నం అనే ప్రశంసలు దక్కుతున్నాయి. స్టార్ హీరోతో చేస్తే మా మూవీ మరింత బ్లాక్ బస్టర్ అయ్యేదనే మాటలు వినిపిస్తున్నాయి. మేము కంటెంట్ ను బిలీవ్ చేశాం, అది బాగుంటే ప్రేక్షకులు మిగతా విషయాలేవీ పట్టించుకోరని నమ్మాం. ఇవాళ థియేటర్ లో ప్రేక్షకులు అదే విషయాన్ని ప్రూవ్ చేస్తున్నారు. మాకు ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు.

Exit mobile version