‘పంచతంత్రం’లో సుభాష్‌గా రాహుల్ విజయ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ విజయ్ తనయుడు రాహుల్ 2018లో ఈ మాయ పేరేమిటో సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత సంవత్సరం నిహారికతో కలిసి సూర్యకాంతంలో నటించిన రాహుల్ విజయ్ గత యేడాది కాలేజ్ కుమార్లో టైటిల్ రోల్ పోషించాడు. ఇప్పుడు హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్న పంచతంత్రంలో రాహుల్ హీరోగా నటిస్తున్నాడు. జూన్ 7 రాహుల్ విజయ్ పుట్టిన రోజు సందర్భంగా అతనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను నిర్మాతలు అఖిలేష్ వర్థన్, సృజన్ ఎరబోలు విడుదల చేశారు. శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో బ్రహ్మానందం, సముతిర ఖని, స్వాతిరెడ్డి, నరేశ్ అగస్థ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
‘పంచతంత్రం’తో రచయితగా, దర్శకుడిగా పరిచయమవుతున్న హర్ష పులిపాక మాట్లాడుతూ “పెళ్లి, కాబోయే జీవిత భాగస్వామి ఎలా ఉండాలనే విషయాల్లో కచ్చితమైన భావాలు ఉన్న 28 సంవత్సరాల యువకుడు సుభాష్ పాత్రలో రాహుల్ విజయ్ కనిపిస్తారు. ఈతరం యువతకు పెళ్లి, జీవితాంతం కొనసాగే బంధాలు, బాధ్యతలు వంటి విషయాల్లో ఉండే కన్‌ఫ్యూజన్‌ను, క్లారిటీని చూపించే పాత్ర. సింపుల్ అండ్ రొమాంటిక్ క్యారెక్టర్ అని చెప్పవచ్చు” అని చెప్పారు.
ఈ సందర్భంగా నిర్మాత సృజన్ ఎరబోలు, అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ “రాహుల్ విజయ్ కు మా ‘పంచతంత్రం’ చిత్రబృందం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. సుభాష్ పాత్రలో అతను కనిపిస్తాడు. అతడిలో ఇప్పటి యువత తమను తాము చూసుకుంటారు. నేటి యువతరానికి ప్రతినిధి లాంటి సుభాష్ పాత్రలో రాహుల్ విజయ్ సహజంగా నటిస్తున్నారు. ఇప్పటివరకు విడుదల చేసిన ఫస్ట్ లుక్స్ కు సూపర్ రెస్పాన్స్ లభించింది. జూలైలో లాస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం. అటు ఇటుగా పది రోజులు షూటింగ్ చేస్తే సినిమా కంప్లీట్ అవుతుంది. లాక్‌డౌన్‌లో ప్రోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ప్రారంభించాం” అని అన్నారు.
Also Read
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
- Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
తాజావార్తలు
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
-
Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
-
Cheque Power : పంచాయతీల్లో చెక్ పవర్‌పై కీలక నిర్ణయం… 7 రోజులు దాటితే యాక్షన్
-
Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?