Site icon NTV Telugu

Rahul Sipligunj : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి..

Rahul Sipligunj

Rahul Sipligunj

సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. పాతబస్తీ కుర్రోడిగా మొదలైన రాహుల్ ప్రస్థానం ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో నాటు నాటు పాట ద్వారా అంతర్జాతీయ స్థాయిలో అస్కార్ దాకా వెళ్లింది. సొంత కృషితో ఎదిగిన అతడు తెలంగాణ యువతకు మార్గదర్శకుడు అని ముఖ్యమంత్రి ప్రకటించారు.

Also Read : Dulquer : సీఎం రేవంత్ రెడ్డితో.. హీరో దుల్కర్ సల్మాన్ ప్రత్యేక భేటీ!

గత ఎన్నికలకు ముందు జరిగిన ఓ కార్యక్రమంలో కూడా అప్పటి పీసీసీ అధ్యక్షుడి హోదాలో రాహుల్ సిప్లిగంజ్‌కు పది లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కోటి రూపాయల నగదు పురస్కారం ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక ఇటీవల గద్దర్ అవార్డుల సందర్భంగా కూడా ప్రత్యేకంగా రాహుల్ సిప్లిగంజ్‌ను ప్రస్తావిస్తూ, త్వరలోనే ప్రభుత్వ ప్రకటన ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ మేరకు ఇవాళ పాతబస్తీ బోనాల పండుగ సందర్భంగా రాహుల్ కు నజరానా ప్రకటించారు. మొత్తానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Exit mobile version