Site icon NTV Telugu

Rahul Ramakrishna : నేను ఒక చిన్న నటుడిని.. పాలన గురించి నాకేం తెలుసు?

Rahul Ramakrishna Marriage

Rahul Ramakrishna Marriage

టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ అందరికీ సుపరిచితమే. రాహుల్ చేసిన ట్వీట్స్ టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ‘మనం భయంకరమైన పరిస్థితుల్లో బతుకుతున్నాం. వచ్చి పరిస్థితుల్ని చక్కదిద్దాలని, డబుల్ డోర్ కం బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నానని కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసాడు. అలాగే విసిగిపోయాను, నన్ను చంపేయండి”, “హైదరాబాద్ మునిగిపోయింది, హామీలన్నీ విఫలమయ్యాయి, వీటిని చక్కదిద్దడానికి ప్రజలు మిమ్మల్ని పిలుస్తున్నారు అని బీఆర్యస్ అధినేత కేసీఆర్ ను ట్యాగ్ చేసి మరొక ట్వీట్ చేశారు. గాంధీ గురించి కూడా మరో ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు. ఈ కామెంట్స్ చేసిన కొన్ని గంటల తర్వాత రాహుల్ రామకృష్ణ తన ఎక్స్ ను డియాక్టివేట్ చేయడం గమనార్హం. అయితే కొందరు రాహుల్ ను బెదిరించారని అందుకే అకౌంట్ డిలీట్ చేసాడని ప్రచారం జరిగింది.

Also Read: Rakshith Atluri: డైరెక్టర్ చెప్పిన కథ నచ్చలేదు.. ఏం చెబుతున్నాడో కూడా అర్థం కాలేదు!

ఈ ప్రచారం అనంతరం ఇప్పుడు పెదవి విప్పాడు రాహుల్ రామకృష్ణ నాకంటే గొప్ప మనసులు చాలా కాలంగా సామాజిక సమస్యలతో సతమతమవుతున్నాయి. పాలన, పరిపాలన గురించి నాకు ఏమి తెలుసు? నేను ఒక చిన్న నటుడిని. రాజకీయ రంగంలోని అనుభవజ్ఞులైన నాయకులతో అనేక సార్లు ఫోన్ మాట్లాడిన తర్వాత, నా ఆందోళన, నిరాశ తప్పు అని నేను గ్రహించాను. వ్యవస్థను ఎవరు, ఎలా నడుపుతున్నారో దానితో సంబంధం లేకుండా, మన భూమికి, ప్రజలకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వ్యవస్థతో పాల్గొనడం నా కర్తవ్యం, నన్ను నేను విమర్శలకు పరిమితం చేసుకోకూడదు. భవిష్యత్తులో నేను పూర్తిగా నన్ను నేను పూర్తిగా నిమగ్నం చేసుకోగలిగే సమయం వచ్చే వరకు, మనందరినీ పీడిస్తున్న సమస్యలను పరిష్కరించడంలో నాకు ఉన్న చిన్న నైపుణ్యాలు వచ్చే వరకు, నేను ఈ ట్విట్టర్ కి బ్రేక్ ఇస్తున్నాను. ఇకపై నేను స్క్రీన్‌పై మాత్రమే కనిపిస్తా, జై తెలంగాణ, జై హింద్ అంటూ రాసుకొచ్చాడు.

Exit mobile version