Rahul Ramakrishna : నేను ఒక చిన్న నటుడిని.. పాలన గురించి నాకేం తెలుసు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ అందరికీ సుపరిచితమే. రాహుల్ చేసిన ట్వీట్స్ టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ‘మనం భయంకరమైన పరిస్థితుల్లో బతుకుతున్నాం. వచ్చి పరిస్థితుల్ని చక్కదిద్దాలని, డబుల్ డోర్ కం బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నానని కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసాడు. అలాగే విసిగిపోయాను, నన్ను చంపేయండి”, “హైదరాబాద్ మునిగిపోయింది, హామీలన్నీ విఫలమయ్యాయి, వీటిని చక్కదిద్దడానికి ప్రజలు మిమ్మల్ని పిలుస్తున్నారు అని బీఆర్యస్ అధినేత కేసీఆర్ ను ట్యాగ్ చేసి మరొక ట్వీట్ చేశారు. గాంధీ గురించి కూడా మరో ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు. ఈ కామెంట్స్ చేసిన కొన్ని గంటల తర్వాత రాహుల్ రామకృష్ణ తన ఎక్స్ ను డియాక్టివేట్ చేయడం గమనార్హం. అయితే కొందరు రాహుల్ ను బెదిరించారని అందుకే అకౌంట్ డిలీట్ చేసాడని ప్రచారం జరిగింది.
Also Read: Rakshith Atluri: డైరెక్టర్ చెప్పిన కథ నచ్చలేదు.. ఏం చెబుతున్నాడో కూడా అర్థం కాలేదు!
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
ఈ ప్రచారం అనంతరం ఇప్పుడు పెదవి విప్పాడు రాహుల్ రామకృష్ణ నాకంటే గొప్ప మనసులు చాలా కాలంగా సామాజిక సమస్యలతో సతమతమవుతున్నాయి. పాలన, పరిపాలన గురించి నాకు ఏమి తెలుసు? నేను ఒక చిన్న నటుడిని. రాజకీయ రంగంలోని అనుభవజ్ఞులైన నాయకులతో అనేక సార్లు ఫోన్ మాట్లాడిన తర్వాత, నా ఆందోళన, నిరాశ తప్పు అని నేను గ్రహించాను. వ్యవస్థను ఎవరు, ఎలా నడుపుతున్నారో దానితో సంబంధం లేకుండా, మన భూమికి, ప్రజలకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వ్యవస్థతో పాల్గొనడం నా కర్తవ్యం, నన్ను నేను విమర్శలకు పరిమితం చేసుకోకూడదు. భవిష్యత్తులో నేను పూర్తిగా నన్ను నేను పూర్తిగా నిమగ్నం చేసుకోగలిగే సమయం వచ్చే వరకు, మనందరినీ పీడిస్తున్న సమస్యలను పరిష్కరించడంలో నాకు ఉన్న చిన్న నైపుణ్యాలు వచ్చే వరకు, నేను ఈ ట్విట్టర్ కి బ్రేక్ ఇస్తున్నాను. ఇకపై నేను స్క్రీన్‌పై మాత్రమే కనిపిస్తా, జై తెలంగాణ, జై హింద్ అంటూ రాసుకొచ్చాడు.
Greater minds than mine have long grappled with social problems. What do I know about governance and administration? I’m just a small actor.
After several long phone calls with seasoned leaders from the entire political spectrum, I have come to realise that my angst and my…— Rahul Ramakrishna (@eyrahul) October 4, 2025
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!