Vikram Malik: వెల్కమ్ టూ ‘జడల్ జమానా’! ‘ది ప్యారడైజ్’ నుంచి ఇప్పుడు ఎవడు వస్తున్నాడో ఎరికెనా?

Vikram Malik

Vikram Malik

Vikram Malik: నేచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ రగ్గడ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ (The Paradise). ‘దసరా’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ‘జాడల్ జమానా’ (Jadal Zamana) వరల్డ్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలోని నటిస్తున్న రాఘవ్ జుయల్ క్యారెక్టర్‌ను మేకర్స్ తాజాగా పరిచయం చేశారు. ఈ సినిమాలో ఆయన విక్రమ్ మాలిక్ అనే చాలా పవర్‌ఫుల్ రూల్‌లో కనిపిస్తున్నట్లు అర్థం అవుతుంది. తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో విక్రమ్ మాలిక్ క్యారెక్టరైజేషన్, బ్యాక్‌డ్రాప్‌ను ఎలివేట్ చేసే కొన్ని పవర్‌ఫుల్ డైలాగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ మూవీలో ఆయన పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా, మాస్‌గా ఉండబోతుందో తాజాగా బయటకు వచ్చిన లైన్స్ స్పష్టం చేస్తున్నాయి. “ఖాన్దాన్ కా షాన్.. దోస్తోన్ కా జాన్.. విక్రమ్ మాలిక్‌కి.. స్వాగతం సుస్వాగతం.. షెహర్ మేరా నామ్ మేరా.. వెల్కమ్ టు జడల్ జమానా..” అంటూ సాగే ఈ మాస్ డైలాగ్స్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తనదైన రా అండ్ రగ్గడ్ స్టైల్‌లో, పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని మలుస్తున్నట్లు ఈ డైలాగ్స్ వింటుంటే అర్థమవుతోంది. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా అధికారిక గ్లింప్స్ లేదా టీజర్‌ను విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సమాచారం. నాని కెరీర్‌లోనే ఇదొక బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ కానుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

×
×
Ad