డైరెక్టర్ గా మారిన బాలయ్య హీరోయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోల్డ్ బ్యూటీ రాధికా ఈ బోల్డ్ బ్యూటీ బాలయ్య హీరోగా నటించిన ‘లెజెండ్’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తరువాత ఆమె తెలుగు, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. తాజాగా రాధికా ఆప్టే మెగా ఫోన్ పట్టారు. రాధికా హార్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘స్లీప్ వాకర్స్’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘స్లీప్‌వాకర్స్’లో షహానా గోస్వామి, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటించారు. పామ్స్ స్ప్రింగ్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రాధికా తాను దర్శకత్వం వహించిన ‘ది స్లీప్‌వాకర్స్’ ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాలొన్న రాధికా తాను దర్శకురాలిగా మారడం గురించి మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ ‘నేను ఎప్పుడూ దర్శకురాలిగా మారాలనుకోలేదు. అసలు అలాంటి ఆలోచనే లేదు. నాకు ఆసక్తికరంగా అన్పించింది రాయాలనుకున్నాను. నేను హనీ ట్రెహాన్, అభిషేక్ చౌబేలకు కథను చెప్పినప్పుడు వారు దాన్ని చేయాలనుకున్నారు. షూటింగ్ కు, ప్రిపేరేషన్ కు 10 రోజులు ఉందనగా కథ రాయడం అయిపోయింది. కథ రాయడం అయిపోయాక అందులో నేను నటించాలని అనుకోలేదు. కానీ దర్శకత్వం వహించాలనుకున్నా. దర్శకత్వం చేయడం నాకు బాగా నచ్చింది’ అంటూ చెప్పుకొచ్చింది రాధికా. కాగా రాధిక చివరిసారిగా ‘ఓకె కంప్యూటర్’ అనే వెబ్ సిరీస్ లో కనిపించింది. అందులో ఆమె నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే వెబ్ సిరీస్ కు మిశ్రమ స్పందన వచ్చింది. రాధికా నెక్స్ట్ మూవీ ‘శ్రీమతి అండర్కవర్’. ఈ చిత్రంలో రహస్య ఏజెంట్‌గా మారిన గృహిణి పాత్రలో ఆమె నటించనుంది.
Also Read
- Tags
- Radhika Apte
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?