Radhika Apte: సంవత్సరానికో సినిమా చేస్తూ ప్రేక్షకులను రాధిక ఆప్టే అలరిస్తోంది. హిట్ ష్లాప్ అని ఆలోచించకుండా.. సినిమాలు, వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతుంది. గత ఏడాది లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘సిస్టర్ మిడ్‌నైట్’ వచ్చిన తర్వాత ఆమె ప్రస్తుతం వరుస చిత్రాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటుంది. ప్రస్తుతం రాధిక ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సాలీ మొహబ్బత్’.. ఇందులో ఆమె పవర్ ఫుల్ రోల్ లో నటిస్తుండగా.. టిస్కా చోప్రా డైరెక్షన్ లో తెరకెక్కుతోంది. ఈచిత్రంతోనే ఆయన దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించి ప్రశంసలు అదుకున్నారు.
Read Also: Mani Ratnam Next Movie: మణిరత్నం లవ్ స్టోరీలో విజయ్ సేతుపతి-రుక్మిణి?
కాగా, జియో స్టూడియోస్ సమర్పణలో స్టేజ్5 ప్రొడక్షన్ బ్యానర్ కింద జ్యోతి దేశ్‌పాండే, మనీష్ మల్హోత్రా, దినేశ్ మల్హోత్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ గత ఏడాది ప్రారంభమైనప్పటికీ విడుదలకు ఇంకా నోచుకోలేదు. దీంతో అంతా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని అనుకున్నారు.. కానీ, తాజాగా, చిత్రబృందం ఓ బిగ్ అప్డేట్ ఇచ్చింది. ‘సాలీ మొహబ్బత్’ థియేటర్స్‌లోకి కాకుండా నేరుగా ఓటీటీలోకి రాబోతుందని ప్రకటించారు. త్వరలోనే జీ5లో స్ట్రీమింగ్ కానుందన్నారు. అయితే, రిలీజ్ డేట్ రివీల్ చేయకుండా బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఇక, ఈ విషయం తెలుసుకున్న సినీ లవర్స్ నిరాశ చెందుతున్నారు.
