టాలీవుడ్‌లో రక్త చరిత్ర సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నటి రాధికా ఆప్టే, లెజెండ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలకు దగ్గరయ్యారు. 2015లో వచ్చిన లయన్ తర్వాత టాలీవుడ్‌కు దూరంగా ఉన్న రాధికా, బాలీవుడ్‌లో వరుస చిత్రాలతో బిజీగా మారింది. 2012లో బ్రిటిష్ సంగీత దర్శకుడు బెనెడిక్ట్ టేలర్‌ను ప్రేమించి పెళ్లాడిన ఆమె, పెళ్లయి పది సంవత్సరాల తర్వాతే తల్లయిన విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్‌లో రాధికా బిడ్డకు జన్మనిచ్చింది. అయితే టాలెంట్‌తో పాటు తన నిజాయితీ గల వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే నటి రాధిక ఆప్టే, ఇటీవల ఒక చేదు అనుభవాన్ని పంచుకున్నారు.
Also Read : Rashmika Mandanna: నా ఎమెషన్స్‌ను దాచుకోడానికి కారణం ఇదే..
ఇటీవల నేహా ధూపియా నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న రాధికా.. ‘ ప్రెగ్నెంట్ అయిన మొదటి మూడు నెలలు నాకు నరకంలా అనిపించాయి. శారీరకంగా–మానసికంగా చాలా బాధ పడ్డాను, అందులోను ఓ సినిమా కారణంగా చాలా ఇబ్బందులు కూడా ఎదురుకున్నాను. ఆ సమయంలో నేను బిగుతైన దుస్తులు ధరించకూడదని చెప్పినా, నిర్మాత పట్టుబట్టాడు. బాగా తినడం వల్ల నా శరీరంలో మార్పులు వచ్చాయి, కానీ నా పరిస్థితిని అర్థం చేసుకోలేదు. షూటింగ్ సెట్‌లో నొప్పితో ఉన్నా వైద్యుడిని కలిసేందుకు కూడా అనుమతించలేదు. ఇది నాకు చాలా బాధ కలిగించిన విషయం. నేను వృత్తి పరంగా ఎప్పుడూ నిజాయితీగా ఉంటాను, కానీ ఇలాంటి సమయంలో కొంత మానవత్వం, సానుభూతి అవసరమని రాధికా స్పష్టం చేశారు’ ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
