NTV Telugu Site icon

‘రాధే’కు 21 కట్స్… స్వయంగా మేకర్సే…!

Radhe the most wanted bhai Makers voluntarily make 21 cuts

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రాధే’. ‘యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్’ ట్యాగ్ లైన్. సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, అతుల్ అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు ఒక్క కట్ కూడా లేకుండా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ చిత్రానికి ‘యుఎ’ను కేటాయించింది. అయితే తాజాగా సెన్సార్ సర్టిఫికేట్ పొందిన తరువాత మేకర్స్ సినిమాలో కొన్ని సన్నివేశాల మార్పులు చేర్పులు చేసినట్టు తెలుస్తోంది. మేకర్స్ సినిమాలో స్వయంగా 21 సీన్లకు కత్తెర వేశారని తెలుస్తోంది. ‘స్వచ్ ముంబై’ స్థానంలో ‘స్వచ్ఛ భారత్’, ‘జై మహారాష్ట్ర’ అనే డైలాగ్ ను కూడా తొలగించారని సమాచారం. కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే మేకర్స్ ఇలా చేశారని తెలుస్తోంది. ఈ చిత్రంలో రణదీప్ హుడా, జాకీ ష్రాఫ్, మేఘా ఆకాష్ కీలక పాత్రల్లో నటించారు. ‘రాధే’ చిత్రం ఈ నెల 13న విడుదల కాబోతోంది. ఒకే రోజున ఇటు థియేటర్లలోనూ, అటు ఓటీటీలోనూ చూసేయొచ్చు. థియేటర్లతో పాటు జీ ప్లెక్స్ లోనూ పే పర్ వ్యూ బేసిస్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. జీ ప్లెక్స్ సంస్థ మూవీని చూడాలంటే రూ. 249 పే చేయాలని ప్రకటించింది.