Site icon NTV Telugu

రాధే : జోష్ పెంచుతున్న ‘దిల్ దే దియా’ వీడియో సాంగ్

Radhe Second Song Dil De Diya out now

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, దిశా పటాని జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘రాధే’. ‘యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్’ ట్యాగ్ లైన్. ప్రభుదేవా దర్శకత్వం వహించగా… సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, అతుల్ అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో రణదీప్ హుడా, జాకీ ష్రాఫ్, మేఘా ఆకాష్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను మే 13న థియేటర్లతో పాటు జీ ప్లెక్స్ లోనూ పే పర్ వ్యూ బేసిస్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని జీ ప్లెక్స్ సంస్థ మూవీని చూడాలంటే రూ. 249 పే చేయాలని ప్రకటించింది. ఓ బాలీవుడ్ సినిమా ఒకే రోజున ఇలా థియేటర్లలోనూ, ఓటీటీలో విడుదల కావడం ఇదే మొదటిసారి. ఇక ఈ చిత్రం నుంచి విడుదలైన ‘సీటిమార్’ సాంగ్ రికార్డులను బద్దలుకొట్టింది. తాజాగా ఈ చిత్రం నుంచి ఐటమ్ నెంబర్ ‘దిల్ దే దియా’ అనే సాంగ్ ను విడుదల చేశారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పై చిత్రీకరించిన ఈ సాంగ్ లో ఆమె డ్యాన్స్, కాస్ట్యూమ్స్, సెట్, మ్యూజిక్ అదిరిపోయాయి. ఈ సాంగ్ కు హిమేష్ రేషమ్మియా సంగీతం అందించగా షబ్బీర్ అహ్మద్ లిరిక్స్ రాశారు. కమాల్ ఖాన్, పాయల్ ఈవ్ ఈ సాంగ్ ను ఆలపించారు. సల్మాన్ అభిమానుల్లో జోష్ పెంచుతున్న ”దిల్ దే దియా’ వీడియో సాంగ్ ను మీరు కూడా వీక్షించండి.

Exit mobile version