బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘రాధే’. ‘యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్’ అనేది ట్యాగ్ లైన్. ‘రాధే’కు ప్రభుదేవా దర్శకత్వం వహించారు. సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, అతుల్ అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ ఓల్డ్ ఏజ్ గ్యాంగ్ స్టర్ గా, దిషా పటాని ఆయన కుమార్తెగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రణదీప్ హుడా, జాకీ ష్రాఫ్, మేఘా ఆకాష్ కీలక పాత్రల్లో నటించారు. సినిమా విడుదలకు ఎప్పుడో సిద్ధమైనప్పటికీ ఈద్ స్పెషల్ గా విడుదల చేయాలనీ సల్మాన్ భావించడంతో… ఇప్పటి వరకు ఆగారు. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఎక్కువ అవుతోంది. చాలామంది హీరోలు తమ సినిమాల విడుదలను వాయిదా వేసుకున్నారు. ఇలాంటి సమయంలో సల్మాన్ ఎవరూ ఊహించని నిర్ణయాన్ని తీసుకున్నారు. ‘రాధే’ను థియేటర్లతో పటు ఓటిటి వేదికపై కూడా ఒకేసారి విడుదల చేయబోతున్నారు. సల్మాన్ తన స్టూడియో భాగస్వామి జీతో కలిసి హాలీవుడ్ స్టూడియోల మాదిరిగా థియేటర్లలో, డిజిటల్ ప్లాట్ ఫామ్ పై ఒకేసారి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈద్ కానుకగా ‘రాధే’ 13 మే 2021న థియేటర్లలోకి రానుంది. ఇక సల్మాన్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రాధే’ ట్రైలర్ ను రేపు విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్.
థియేటర్లో, ఓటిటిలో ఒకేసారి సల్మాన్ ‘రాధే’ రిలీజ్…!!
