Site icon NTV Telugu

R. Narayana Murthy: హాస్పిటల్ నుంచి డిశ్చార్జయిన ఆర్ నారాయణమూర్తి… శిరస్సు వంచి నమస్కారం!

R. Narayana Murthy Discharged from NIMS Hospital: పీపుల్ స్టార్ గా ప్రేక్షకులలో ప్రజలలో మంచి గుర్తింపు సంపాదించిన ఆర్.నారాయణమూర్తి కొద్ది రోజుల క్రితం అనారోగ్యం పాలైన సంగతి తెలిసిందే. వెంటనే ఆయనను ఆయన సన్నిహితులు హైదరాబాద్లో ఉన్న నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇక ఈ సందర్భంగా ఆయనకు అస్వస్థత అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో ఆయన స్పందించారు. తాను అనారోగ్యం పాలు కావడంతోనే నిమ్స్ హాస్పటల్లో జాయిన్ అయ్యానని, ఆందోళలన చెందాల్సిన అవసరం లేదని, అసలు ఏం జరిగిందని విషయం డిశ్చార్జ్ అయ్యే సమయంలో వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు. ఇక ఈ ఉదయం ఆయనను తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఫోనులో పరామర్శించారు. ఆర్.నారాయణమూర్తికి ఫోన్ చేసిన కేటీఆర్ ఆయనకు ఏమైంది అని వాకబు చేశారు.

Pawan Kalyan: భార్య గ్రాడ్యుయేషన్.. సింగపూర్‌లో పవన్‌

అంతేకాదు ఆయనకు అన్ని విధాలుగా అండగా ఉంటామని కూడా కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇక కొద్దిసేపటి క్రితం నిమ్స్ హాస్పిటల్ నుంచి ఆర్ నారాయణమూర్తి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ దేవుడు దయవల్ల తాను ఆరోగ్యంగానే ఉన్నానని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప గారికి అక్కడ డాక్టర్స్కు, సిబ్బందికి, నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. అలాగే తన క్షేమాన్ని కోరుకున్న ప్రేక్షక దేవుళ్లకు కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఎక్కువగా విప్లవాత్మక సినిమాలు చేసే ఆర్.నారాయణమూర్తి దర్శకుడిగా హీరోగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే తాను చేసే సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు.

Exit mobile version