Site icon NTV Telugu

కొమరం భీం రికార్డ్స్ బ్రేక్ చేసిన ‘పుష్ప’రాజ్…!

Pushparaj Introduction Video Breaks All time Highest Views Record

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. ఈ చిత్రం నుంచి అల్లు అర్జున్ ను పుష్పరాజ్ గా పరిచయం చేసిన టీజర్ ఇప్పటికే టాలీవుడ్‌లో చాలా రికార్డులు సృష్టించింది. ఈ టీజర్ ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ నుండి జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ టీజర్ ‘రామరాజు ఫర్ భీమ్’ రికార్డును బ్రేక్ చేయడం విశేషం. అంతేకాదు టాలీవుడ్ లో 1.2 మిలియన్లకు పైగా లైక్‌లను సాధించిన టీజర్‌గా పుష్పరాజ్ టీజర్ నిలిచింది. ఇక పుష్ప రాజ్ ఈ ఘనత సాధించడానికి 11 రోజులు కాగా… జూనియర్ ఎన్టీఆర్ ‘రామరాజు ఫర్ భీమ్’ వీడియో 40 రోజుల్లో ఈ మార్కును దాటింది. టాలీవుడ్ లో అంత్యంత్య వేగంగా 44+ మిలియన్ల వీక్షణలను సాధించిన ఘనత పుష్పరాజ్ సొంతమైంది. ప్రస్తుతం యూట్యూబ్ లో పుష్పరాజ్ హవా చూస్తుంటే టాలీవుడ్ లో ఇతర హీరోలకు భారీ టార్గెట్ ను నిర్దేశించడం ఖాయంగా కన్పిస్తోంది. ఇక ‘పుష్ప’కు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ విలన్ గా కనిపించబోతున్నారు.

Exit mobile version