NTV Telugu Site icon

Dhanunjay: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ‘పుష్ప’ విలన్..

February 7 (98)

February 7 (98)

టాలీవుడ్ నుండి విడుదలైన ‘పుష్ప’ మూవీ ఎలాంటి సెన్‌సెషనల్ హిట్ అందుకుందో చెప్పర్లేదు. డిసెంబ‌ర్ 5న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది.ఇక ఈ మూవీతో ఓవ‌ర్‌నైట్ స్టార్‌గా మారారు డాలీ ధ‌నుంజ‌య్‌ అలియాస్ జాలిరెడ్డి. అత‌ని విల‌నిజంతో ప్రేక్షకులను ఎంతో ఆక‌ట్టుకున్నాడు. ఇక ఇటీవ‌ల ధ‌న్యత అనే అమ్మాయితో ధ‌నుంజ‌య్‌కి నిశ్చితార్థం జ‌రిగిన విష‌యం తెలిసిందే. గ‌తేడాది న‌వంబ‌రులో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ జంట.. ఫిబ్రవరి 15,16 న మా పెళ్లి జరుగుతుందంటూ సోషల్ మీడియాలో  ద్వారా తెలిపారు. ఇక చెప్పినట్లుగానే వివాహం బంధం లోకి అడుగుపెట్టారు.

Also Read: Nidhi Agrawal: వీర‌మ‌ల్లు ల్లో ఎన్నో స‌ర్‌ప్రైజ్‌లు దాగి ఉన్నాయి: నిధి అగర్వాల్

ఫిబ్రవరి 16 అంటే ఈ రోజు మైసూర్ లోని ఎగ్జిబిష‌న్ గ్రౌండ్స్‌లో ఇరు కుటుంబల సమక్షంలో ఎంతో గ్రాండ్‌గా మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. చిన్నప్పటి నుంచి చ‌దువుకున్న ఊరు కావ‌డంతో అక్కడే పెళ్లి చేసుకోవాల‌ని ధ‌నుంజ‌య్ నిర్ణయించుకున్నట్లు స‌మాచారం. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వివాహ వేడుకకు ముందు శనివారం (ఫిబ్రవరి 15) రాత్రి రిసెప్షన్ ఏర్పాటు చేశారు. కాగా ఈ రిసెప్షన్‌కి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు. డైరెక్టర్ సుకుమార్ కూడా రిసెప్షన్ వేడుకకు హాజరయ్యారు.అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే.. ధనంజయ అసలు పెళ్లి చేసుకోనని ఇంట్లో వారిని బాగా విసిగించాడట. దీంతో అతడిని ఎలా ఒప్పించాలి అని తల్లి సావిత్రమ్మ తెగ టెన్షన్‌ పడుతూనే.. పెళ్ళి చేసుకోమని గత ఐదేళ్లుగా వెంట పడటం తో అమ్మ మాట కాదనలేక ఎట్టకేలకు పెళ్లికి ఓకే చెప్పాడట ధనంజయ.