NTV Telugu Site icon

Pushpa2 : హిందీలో వండర్స్ క్రియేట్ చేస్తున్న పుష్ప -2

Pushpa

Pushpa

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప – 2. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి సెన్సేషన్ రికార్డ్స్ క్రియేట్ చేస్తూ వెళుతోంది. పుష్ప పార్ట్ 1 కు కొనసాగింపుగా వచ్చిన ఈ సినిమా విడుదల నాటి నుండి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మొదటి రోజు నుండే ఈ సినిమా రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ వసులు చేసింది.

Also Read : Robinhood : శివరాత్రికి రాబిన్ హుడ్ రిలీజ్..?

కాగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాలను మించి హిందీలో కలెక్షన్స్ రాబడుతోంది. మొదటి రోజు రూ. 72 కోట్లు కలెక్షన్స్ రాబట్టి ఆల్ టైమ్ రికార్డు స్టార్ట్ అందుకుంది. ఇక అదే జోష్ లో కొనసాగుతు రెండవ వారంలో అడుగుపెట్టింది పుష్ప -2. ఇక సెకండ్ వీకెండ్ ఆదివారం నాడు నార్త్ లో మెజారిటీ స్టేట్స్ లో హౌస్ ఫుల్ బోర్డ్స్ పెట్టింది. ఇక హిందీలో ఇప్పటివరకు రాబట్టిన కలెక్షన్స్ చూసుకుంటే 11 రోజులకుగాను రూ. 561.50 కోట్ల గ్రాస్ రాబట్టి హయ్యెస్ట్ గ్రాసింగ్ హిందీ డబ్బింగ్ ఫిల్మ్ ఆఫ్ ఆల్ టైమ్ గా నిలిచింది.దాంతో పాటు రెండవ వారంలో హిందీ లో హయ్యెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ గా కూడా రికార్డు క్రియేట్ చేసింది. అలాగే రెండవ వారంలో రూ. 100 కోట్లు రాబట్టిన మొట్ట మొదటి సినిమాగా ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసాడు పుష్ప రాజ్. ఇకవరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఇప్పటికే రూ. 1292 కోట్ల కు పైగా రాబడు దూసుకెళుతోంది పుష్ప

Show comments