ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సినిమా పుష్ప – 2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ ను పుష్ప -2 కు సీక్వెల్ గా పుష్ప – 3 చేయాలని ఫ్యాన్స్ కోరగా అనుదుకు బదులుగా సుక్కు మాట్లాడుతూ బన్నీ మూడు ఏళ్లు డేట్స్ ఇస్తే తప్పుకుండా చేస్తానని అన్నారు.
Also Read : Pushpa2 : పుష్ప – 2 క్లైమాక్స్ BGM వర్క్ పై ‘సామ్ సీఎస్’ సంచలన ట్వీట్..
ఇప్పుడు పుష్ప -3 సంబంధించి సంచలన వార్త లీక్ అయింది. పుష్ప -2 ఫైనల్ మిక్సింగ్ ను ఫినిష్ చేస్తూ సౌండ్ ఇంజినీర్ రసూల్ పూకుట్టి చేసిన పోస్ట్ లో బ్యాగ్రౌండ్ లో స్క్రీన్ పై పుష్ప – 3 ది ర్యాంపేజ్ అని లోగో తో పోస్టర్ డిజైన్ చేసి ఉండడంతో పుష్ప సిక్వెల్ ముందే ఫిక్స్ చేసినట్టు కన్ఫార్మ్ అయింది. అదే టైమ్ లో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ 2022 లో పుష్ప ది రైజ్, పుష్ప -2 ది రూల్, పుష్ప -2 ది ర్యాంపేజ్ సినిమాలు చేస్తున్న సుకుమార్ కు బర్త్ డే విష్ చేస్తూ ట్వీట్ చేసాడు. అంటే పుష్ప -3 ఎప్పుడో ఫిక్స్ అయిందనే విజయ్ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. పుష్ప – 3 ఫోటో లీక్ కావడంతో వెంటనే తేరుకున్న సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి ఆ ఫోటోను డిలీట్ చేసాడు. కానీ అప్పటికే అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరి ఈ సిక్వెల్ ను ఎప్పుడు తెరకెక్కిస్తారో రానున్న రోజుల్లో క్లారిటీ వస్తుందేమో చూడాలి.