NTV Telugu Site icon

Pushpa – 2 : బాలీవుడ్ లో కొనసాగుతున్న పుష్పరాజ్ హవా

Pushpa2

Pushpa2

‘పుష్ప 2’ బాలీవుడ్ దండయాత్ర ఇప్పట్లో ఆగేలా లేదు. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం మొదటి రోజు నుండి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతోంది. సౌత్ తో పోలిస్తే ఈ సినిమా హిందీలో ఒక రేంజ్ లో దూసుకెళ్తోంది. సెకండ్ వీకెండ్ లోనూ థియేటర్లలో విపరీతమైన ప్రేక్షకులను ఆకర్షించిన ‘పుష్ప 2’ వర్కింగ్ డేస్ లో డీసెంట్ కలెక్షన్స్ రాబట్టి వీకెండ్స్ లో హౌస్ ఫుల్స్ తో నడుస్తోంది.

డిసెంబరు 5న రిలీజ్ అయిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా మూడవ వారంలో అడుగుపెడుతోంది. వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ కొల్లగొడుతున్న పుష్ప 2 , ఒక్క బాలీవుడ్ లోనే 16 రోజులకు గాను రూ. 645 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఈ వసూళ్లతో ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా షారుక్ ఖాన్ ‘జవాన్’ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టి సరికొత్త రికార్డును తన పేరిటా రాసాడు పుష్ప రాజ్. ఈ రోజు వీకెండ్ కావడంతో భారీ స్థాయి వసూళ్లు రాబట్టే ఛాన్స్ లేకపోలేవుదు. అల్లు అర్జున్ కు హిందీలో తిరుగులేని స్టార్ డమ్ ను తీసుకువచ్చిన ఈ సినిమా లాంగ్ రన్ రూ. 1000 కోట్ల రూపాయల వసూళ్లను సాధించిన ఆశ్చర్యం లేదని ట్రేడ్ అంచనా వేస్తుంది. ఇక 16 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా రూ. 1508 కోట్ల మార్క్ అందుకున్న ఈ సినిమా రెండు వేల కోట్ల టార్గెట్ ను రీచ్ అవుతుందేమో చూడాలి.