NTV Telugu Site icon

Pushpa 2 : పుష్ప గాడి సత్తా చూపించే ప్లాన్ రెడీ చేసిన మైత్రి

Pushpa2therule (2)

Pushpa2therule (2)

పుష్ప 2: ది రూల్ ఇండియన్ సినీ పరిశ్రమలోనే ఒక అతి పెద్ద రిలీజ్ గా నిలవబోతోంది. ఆదివారం రాత్రి బీహార్ రాజధాని పాట్నాలో గ్రాండ్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరగగా, జనం లక్షల్లో కార్యక్రమానికి హాజరయ్యారు. ట్రైలర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సినిమా మీద ఉన్న బజ్ కారణంగా ఇప్పటికే సినిమాకు సంబంధించిన డీల్స్ అన్నీ క్లోజ్ అయ్యాయి. మైత్రీ మూవీ మేకర్స్, నిర్మాతలు పుష్ప 2 : ది రూల్ ప్రమోషన్స్ కోసం భారీ ఖర్చు పెడుతున్నారు. ఈసారి పుష్ప గాడి సత్తా ఏంటో క్లారిటీగా చూపించే విధంగా ఒక వినూత్న ప్లాన్‌తో ముందుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి స్క్రీన్‌లో మొదటి టికెట్ వేలం ద్వారా విక్రయించేందుకు ప్లాన్ చేశారు.

Dil Raju vs Mythri Movie Makers: దిల్ రాజుకు మైత్రీ మార్క్ కౌంటర్?

సినిమా బుకింగ్స్ సమాచారం ఆన్‌లైన్‌లో ఉంచి మొదటి టిక్కెట్‌ను ఆన్‌లైన్ బిడ్డింగ్ ద్వారా అమ్మాలని ప్లాన్ చేస్తున్నారు. సినిమాకి ఉన్న క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడానికి ఇదో స్పెషల్ ప్లాన్. దీంతో సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు అదనపు ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు. ఈ వేలాన్ని అతి త్వరలో అమలు చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీన్ని ఇతర భాషలకు అమలు చేస్తారా లేక తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేస్తారా అనే దానిపై స్పష్టత లేదు. అల్లు అర్జున్ పుష్ప 2: ది రూల్ డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో సుకుమార్ పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు. అందుకే ఆయన ఈవెంట్ కి కూడా హాజరు కాలేదు.

Show comments