NTV Telugu Site icon

Pushpa – 2 : ‘కిస్సిక్’ స్పెషల్ సాంగ్ ఫోటో లీక్

Kissik

Kissik

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్నమోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ ఫిలిం ‘పుష్ప-2’ . ప్రపంచవ్యాప్తంగా అటు బన్నీ ఫాన్స్ తో పాటు సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌.వైలు సుకుమార్‌ రైటింగ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటి విడుదలైన టీజర్‌, రెండు పాటలు ఎంతటి సన్సేషన్స్‌ సాధించాయో చెప్పాల్సిన అవసరం లేదు. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

తాజగా ఈ సినిమాలోకి స్పెషల్ సాంగ్ షూట్ ను మొదలెట్టారు మేకర్స్. ఈ సాంగ్ కోసం టాలీవుడ్ డాన్సింగ్ డాల్ శ్రీలీలను ఎంపిక చేశారు దర్శకుడు సుకుమార్. దాదాపు గత ఐదు రోజులుగా ఈ సాంగ్ ను షూట్ చేస్తున్నారు. అయితే ఈ స్పెషల్ సాంగ్ పేరును ప్రకటించారు మేకర్స్. బన్నీ శ్రీలీలపై వచ్చే ఈ పాట ‘కిస్సిక్’ అంటూ రానుంది. మొదటి పార్ట్ లోని ఊ ‘అంటావా మావ’ ఎలాగైతే సెన్సేషన్ అయిందో రాబోతున్న ‘కిస్సిక్’ కూడా అంత పాపులర్ అవుతుంది అని టీమ్ భావిస్తోంది. ఇదిలా ఉండగా ఈ ‘కిస్సిక్’ సాంగ్ లోని ఫోటో ఒకటి లీక్ అయింది. పింక్ డ్రెస్ లో బన్నీ, శ్రీలీల ఈ సాంగ్ పై అంచనాలను ఓ రేంజ్ లో పెంచేసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ కిస్సిక్ పాటలోని ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

Show comments