Site icon NTV Telugu

Pushpa -2 : ఈ సారి ఇంటర్నేషనల్ ఈవెంట్.. ఎక్కడంటే..?

Pushpa Rules

Pushpa Rules

మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న నటించిన సినిమా పుష్ప 2.ఈ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలో ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. దేశంలోనే అతిపెద్ద సినిమా అయిన పుష్ప 2 ట్రైలర్ లాంచ్ కూడా దేశంలోని అతిపెద్ద ఈవెంట్ కావడం మరింత విశేషం. దేశంలోనే ఎన్నడూ లేనివిధంగా సుమారు మూడు లక్షల మందికి పైగా ఓ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది పాట్నా చరిత్రలో ఎన్నడు జరగని పెద్ద ఈవెంట్ గా కొత్త రికార్డు సృష్టించింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ సేన సాహెబ్ హాజరు కావడం జరిగింది. సుమారు 900 మంది పోలీసులు, 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీ వ్యక్తుల మధ్య ఈ ఈవెంట్ జరగటం విశేషం

Also Read : Ram Charan : ఏఆర్ రెహమాన్‌కు ఇచ్చిన మాట కోసం కడప దర్గాకు రామ్ చరణ్..

ట్రైలర్ చెప్పినట్టు పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా కాదు ఇంటర్నేషనల్ అనే డైలాగ్ కు తగ్గట్టుగా ట్రైలర్ లాంఛ్ కు నేషనల్ లెవల్ లో చేసిన మేకర్స్ ఈ దఫా ఇంటర్ నేషనల్ ఈవెంట్ ప్లాన్ చేసారు. ఇందుకోసం దుబాయ్ లో ఈవెంట్ ప్లానింగ్ చేస్తున్నారు మేకర్స్. అలాగే ముంబై లో మరో ఈవెంట్ ప్లాన్ చేస్తోంది యూనిట్. కానీ ముంబాయి ఈవెంట్ కేవలం పుష్ప నార్త్ బెల్ట్ బుకింగ్స్ ఓపెన్ చేస్తున్నాం అని తెలియజేసేందుకేనట. ఆ విషయమై ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారట. ఇక ఇండియాలో జరగబోయే మిగతా ఈవెంట్స్ పాట్నా ఈవెంట్ లా భారీ ఈవెంట్లే అని యూనిట్ సమాచారం.

Exit mobile version