NTV Telugu Site icon

Pushpa -2 : గత పదేళ్లలో ఇలా జరగడం మొదటిసారి : మైత్రీ రవి

Pushpa

Pushpa

మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా   నటించిన చిత్రం పుష్ప -2. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్ర ట్రైలర్  గత ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలో లాంచ్ చేయడం జరిగింది. దేశంలోనే అతిపెద్ద సినిమా అయిన పుష్ప 2 ట్రైలర్ లాంచ్ కూడా దేశంలోని అతిపెద్ద ఈవెంట్ కావడం మరింత విశేషం. దేశంలోనే ఎన్నడూ లేనివిధంగా సుమారు మూడు లక్షల మందికి పైగా ఓ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది పాట్నా చరిత్రలో ఎన్నడు జరగని పెద్ద ఈవెంట్ గా కొత్త రికార్డు సృష్టించింది.సుమారు 900 మంది పోలీసులు, 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీ వ్యక్తుల మధ్య ఈ ఈవెంట్ జరగటం విశేషం.

Also Read : Actress Kasturi : అరెస్టుకు ముందు వీడియో రికార్డు చేసిన కస్తూరి

ఈ సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ నవీన్ మాట్లాడుతూ “పాట్నా ప్రజలందరికీ నమస్కారం. ఇంతటి అభిమానాన్ని మేము పాట్నా నుండి అస్సలు ఊహించలేదు. ఒకరికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. ఈ చిత్రం ఇంతటి విజయవంతమైన ప్రయాణం కావడానికి ముఖ్య కారణం స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్.

మైత్రి మూవీ మేకర్ రవి మాట్లాడుతూ “మేము ఇప్పటికీ ఎన్నో చిత్రాలను చేశాము. ఎన్నో ఈవెంట్స్ కూడా చేశాము. కానీ ఒక ట్రైలర్ను ఇలా విడుదల చేయడం అనేది మొదటిసారిగా జరుగుతుంది. పాట్నా నుండి ఇంతటి అభిమానాన్ని మేము ఊహించలేదు. వచ్చిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. డిసెంబర్ 5తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గత పది సంవత్సరాల్లో ఇంతటి పెద్ద ఈవెంట్ చూడటం ఇదే తొలిసారి” అన్నారు

Show comments