NTV Telugu Site icon

Pushpa 2: అనుకున్నంతా అయ్యింది.. పుష్ప గాడు వెనక్కి తగ్గాడు!

Pushpa Raj

Pushpa Raj

పుష్ప 2 సినిమా గురించి ఈ ఉదయం నుంచి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే రేపు సాయంత్రం హైదరాబాదులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని సినిమా యూనిట్ తో నిర్ణయించింది. ముందుగా మల్లారెడ్డి కాలేజీలో ఈ ఈవెంట్ నిర్వహించేందుకు అంతా ప్లాన్ చేశారు. అయితే చివరి నిమిషంలో ఈడి రైడ్స్ నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో ఎక్కడ నిర్వహించాలి అని సినిమా యూనిట్ అనేక మల్లగుల్లాలు పడింది. చివరికి యూసఫ్ గూడా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించేందుకు సిద్ధమై పర్మిషన్ కోసం ప్రయత్నాలు చేసింది.

Pushpa 2: పుష్ప 2 రిలీజ్ ముందు ‘శిల్పా’ బ్యానర్ ఆటలు!

అయితే పర్మిషన్ దొరకలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు కాకుండా సోమవారం నాడు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రెండో తేదీ సాయంత్రం ఐదున్నర గంటల నుంచి యూసఫ్ గూడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈ ఈవెంట్ నిర్వహించేందుకు అనుమతి లభించింది. దీంతో ఎట్టకేలకు ఈ విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని సుకుమార్ డైరెక్ట్ చేశాడు. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి ఈ సినిమాని సుకుమార్ సహ నిర్మించడం గమనార్హం.