NTV Telugu Site icon

Pushpa 2: మీరు ఊహించలేరప్పా.. వేరే లెవల్ ఇక!

Pushpa 2

Pushpa 2

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమాకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద చాలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలతో పాటు సుకుమార్ కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త తెరమీదకు వచ్చింది. అదేంటంటే పుష్ప 2 క్లైమాక్స్ ఫైట్ ఇప్పటివరకు ఊహించని విధంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మీ ఊహల్లో ఉన్నదానికి భిన్నంగా ఈ సినిమా ఉండబోతుందని, సుకుమార్ మీ అందరికీ ఒక పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారని సినిమా యూనిట్ కి సన్నిహితంగా ఉన్న వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

Tollywood: చిన్న సినిమాలకి సెలబ్రిటీలు ఎందుకు సపోర్ట్ చేయాలి?

నిజానికి ఈ మధ్యకాలంలో చాలా సినిమాలకు క్లైమాక్స్ కీలకంగా మారుతుంది. ఇటీవల రిలీజ్ అయిన క సినిమాతో పాటు, పొట్టేల్ లాంటి సినిమాలకు కూడా ఈ క్లైమాక్స్ కీలకమవుతుంది. ఇప్పుడు పుష్ప 2 సినిమా విషయంలో కూడా ఈ క్లైమాక్స్ కి స్పెషల్ కేర్ తీసుకోబోతూ ఉండడం హాట్ టాపిక్ అవుతుంది. అంతేకాదు పుష్ప 3 కూడా ఉండే అవకాశం ఉందని ఇప్పటికే హింట్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సెకండ్ పార్ట్ క్లైమాక్స్ ని ఒక రేంజ్ లో షూట్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఫహాద్ ఫాజిల్ కేవలం రెండో భాగానికి మాత్రమే పరిమితం కాడని, మూడవ భాగంలో కూడా ఆయన పాత్ర ఉండేలాగా సుకుమార్ కథ సిద్ధం చేశారని చెబుతున్నారు. ఇక డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సర్వం సిద్ధమైంది. షూట్ కాస్త ఆలస్యమైనా చెప్పిన డేట్ కే దింపేందుకు చాలా పెద్ద ఎత్తున ప్లాన్స్ అయితే జరుగుతున్నాయి .

Show comments