ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప -2. డిసెంబరు 4 ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఇక మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని నైజాం, సీడెడ్, ఉత్తరాంద్ర, వంటి ఏరియాస్ లో ఆల్ టైమ్ హయ్యెస్ట్ కెలెక్షన్స్ ను టచ్ చేసినట్టు ట్రేడ్ అంచనా వేస్తుంది -2. బాహుబలి -2, RRR రికార్డ్స్ ను బ్రేక్ చేసినట్టు లెక్కలు వేస్తున్నారు. కానీ పుష్ప -2 డే – 1 కలెక్షన్స్ పై అధికారంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు.
Also Read : Pushpa -2 : కేరళలో ప్రభాస్, మోహన్ లాల్, ముమ్మట్టి రికార్డ్స్ బ్రేక్
కానీ రెండవ రోజు అడ్వాన్స్ బుకింగ్స్ షాక్ గురిచేస్తున్నాయని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి . బుక్ మై షో లో హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే పుష్ప 2 కేవలం రూ. 6 కోట్లు మాత్రమే వసులు చేసింది. ఇటీవల వచ్చిన దేవర 5.45 కోట్లు రాబట్టింది. కానీ దేవర కంటే పుష్ప కు డబుల్ రేట్స్ పర్మిషన్స్ ఇచ్చారు. అయిన పుష్ప బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. అటు ఆంధ్రాలోనూ అడ్వాన్స్ బుకింగ్స్ చిన్నపాటి వార్నింగ్ ఇస్తున్నాయి, మొదటి రోజు హ్యుజ్ స్టార్ట్ అందుకున్న పుష్ప రెండవ రెండవ ఇంతటి భారీ డ్రాప్ తీసుకోవడానికి కారణాలు ఆరాతీస్తున్న ట్రేడ్ కు వినిపిస్తున్న ఒకటే మాట టికెట్ ధర. ఈ విషయంలో కాస్త ముందుగా మేల్కొన్న ఏపీలోని ముఖ్యమైన ఏరియాలోని మల్టీప్లెక్స్ యాజమాన్యాలు జీవో లో ఉన్న ధరల ప్రకారం రూ. 377 ఉండగా తగ్గించి రూ. 300 కు నిర్ణయించారు. తగ్గించిన టికెట్ ధరలతో సాయంత్రం, నైట్ షోస్ లో ఏమైనా జంప్ ఉంటుందో లేదో చూడాలి.
నోట్ : ఈ సమాచారం సోషల్ మీడియా ద్వారా సేకరించింది. దీనిని ఎన్టీవీ ధృవీకరించడం లేదు.