డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో మల్టిపుల్ లాంగ్వేజెస్‌లో రూపొందనున్న ఈ సినిమా పూరి కనెక్ట్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్ , చార్మీ కౌర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం హిందీ భాషల్లో విడుదల కానుంది. కాగా ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో యాక్ట్ చేసే ప్రధాన నటీనటుల వివరాలను ప్రకటిస్తూ వస్తున్నాడు పూరి. ఇప్పటికే ఈ మూవీలో టబు కీలక పాత్ర పోషించనుండగా, విజయ్ కుమార్ కూడా నటిస్తున్నాడు. అయితే ఈ మూవీకి ‘బెగ్గర్ ’ అనే టైటిల్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ..
Also Read : Bollywood : బాలీవుడ్ నుంచి మరో చరిత్రాత్మక చిత్రం..
తాజాగా ఓ మూవీ ఈవెంట్‌లో పాల్గోన్న విజయ్ సుతుపతి దీనిపై కొంత క్లారిటీ ఇచ్చారు.. ‘ పూరి జగన్నాథ్ పనిని నేను గౌరవిస్తాను. ఆయన తెరకెక్కించిన ప్రతి ఒక్క సినిమా చూశా. స్క్రిప్టు వినడానికి రెండు, మూడు రోజులు పడుతుందేమో అనుకున్నా. గంటల వ్యవధిలోనే పూర్తి చేశారు. జూన్ ల్లో షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఆడియన్స్ కంటే నేనే ఎక్కువ ఆసక్తిగా ఎదురుచూస్తున్న.. ఇక టైటిల్ అంటారా ఇంకా సినిమాకి టైటిల్ పెట్టలేదు. బెగ్గర్ అని మీరే ఖరారు చేశారా?’ అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు.
