ప్రస్తుతానికి పూరీ జగన్నాథ్ టైం ఏమీ బాలేదు. చివరిగా ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాతో హిట్ అందుకున్న ఆయన ఆ తర్వాత లైగర్, డబుల్ ఇస్మార్ట్ లాంటి సినిమాలు చేసి దారుణమైన డిజాస్టర్లు మూటగట్టుకున్నాడు. ప్రస్తుతానికి ఆయన తన రెగ్యులర్ రైటింగ్ టీంతో పాటు కొత్త టీం రెడీ చేసుకుని గోవాలో కూర్చుని కొన్ని సినిమా స్క్రిప్ట్స్ సిద్ధం చేశాడు. దాదాపుగా మూడు కథలను ఆయన సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అందులో ఒకటి గోపీచంద్ హీరోగా చేసిన గోలీమార్ సినిమాకి సీక్వెల్ కాగా మరో స్క్రిప్ట్ గురించి చర్చలు జరుగుతున్నాయి. గతంలో ఆయన కమల్ హాసన్ లేదా రజినీకాంత్ తో ఒక సినిమా చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. వారికి ఒక కథ ఆయన చెప్పారు.
Yellamma: బుజ్జి తల్లి కోసం ఎల్లమ్మ ఎదురుచూపులు?
ఇప్పుడు కొత్త టీంతో అదే కథను ట్రెండీగా మార్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆ కథను ఆయన మెగాస్టార్ చిరంజీవి దృష్టికి తీసుకువెళ్లబోతున్నట్లుగా చెబుతున్నారు. నిజానికి పూరీ జగన్నాథ్ చిరంజీవి కాంబినేషన్ లో ఎప్పుడో సినిమా రావాల్సి ఉంది కానీ పలు కారణాలతో ఆ ప్రాజెక్టు సెట్ కాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన మెగాస్టార్ చిరంజీవికి రజనీకాంత్ అలాగే కమల్ హాసన్ రిజెక్ట్ చేసిన కథనే నెరేట్ చేయబోతున్నాడని అది కనుక నచ్చితే మెగాస్టార్ చిరంజీవితో సినిమా పట్టాలు ఎక్కినట్లేనని తెలుస్తోంది. ఒకరకంగా అదే గనుక జరిగితే పూరి నుంచి ఒక స్ట్రాంగ్ కం బ్యాక్ ఎక్స్పెక్ట్ చేయవచ్చని పూరిని అభిమానించే అభిమానులు భావిస్తున్నారు. ఇక ఇప్పుడైతే స్క్రిప్ట్ ఇంకా షైన్ చేసే పనిలో ఉంది పూరి అండ్ టీం.