Puri Jagannadh: ‘పర్ఫెక్ట్ హస్బెండ్’ ఆడియో వివాదం పై.. ఎట్టకేలకు నోరు విప్పిన పూరి జగన్నాథ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా లాక్డౌన్ సమయంలో పూరి జగన్నాథ్ పంచుకున్న ‘పూరి మ్యూజింగ్స్’ ఆడియోలు ఇప్పటికీ ఏదో ఒక రూపంలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. కానీ, తాజాగా ‘పర్ఫెక్ట్ హస్బెండ్’ టాపిక్‌లో ఆయన దేవుళ్లను, సీతారాముల ప్రస్తావనను తీసుకురావడంతో హిందూ సంఘాలతో పాటు సామాన్య నెటిజన్లు కూడా ఆయన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేశారు. ఈ వివాదం రోజురోజుకూ ముదురుతుండటంతో పూరి జగన్నాథ్ దీనిపై ఓపెన్‌గా స్పందించక తప్పలేదు.
సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శలపై పూరి జగన్నాథ్ సామాజిక మాధ్యమాల వేదికగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.. ‘ఆ ఆడియో ఇప్పటిది కాదు, దాదాపు ఐదేళ్ల క్రితం లాక్డౌన్ సమయంలో కేవలం ప్రాక్టికల్ లైఫ్‌ను, సమాజంలో భార్యాభర్తల మధ్య ఉండే అడ్జస్ట్మెంట్లను వివరించడానికి సరదాగా చేసిన పాడ్‌కాస్ట్ అది. దాన్ని ఇప్పుడు కావాలనే కొందరు స్క్రీన్ షాట్లు, క్లిప్పులు తీసి వివాదంగా మారుస్తున్నారు’ అని పూరి అసహనం వ్యక్తం చేశారు. అంతే కాదు పురాణాలను లేదా దేవుళ్లను అవమానించాలనే ఉద్దేశం తనకు అస్సలు లేదని, కేవలం గొప్ప వ్యక్తుల జీవితాల్లో కూడా భార్యలకు కష్టాలు తప్పలేదనే లాజిక్‌ను చెప్పడానికే ఆ ఉదాహరణలు వాడానని, దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని ఆయన పేర్కొన్నారు.
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
పూరి జగన్నాథ్ తన ఆడియోలో చెప్పిన ముఖ్య సారాంశం ప్రకారం.. ఈ ప్రపంచంలో ఏ భార్యాభర్తలూ పర్ఫెక్ట్ కాదు. పెళ్లి అనేది ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సాగించే ప్రయాణం (Adjustment of India). బయటి వ్యక్తుల మాటలు విని కాపురాలు పాడుచేసుకోవద్దనే మంచి ఉద్దేశంతోనే ఆయన ఆ విషయాలు చెప్పారు. కానీ, ఆయన వాడిన కొన్ని బోల్డ్ పదాలు సెంటిమెంట్లను గాయపరచడంతో ఈ రచ్చ మొదలైంది. ఏదేమైనా, పూరి అభిమానులు మాత్రం ఆయనకు మద్దతుగా నిలుస్తూ.. ఐదేళ్ల నాటి పాత విషయాలను తవ్వి తీసి ఇండస్ట్రీలో ఆయన ఇమేజ్ను దెబ్బతీయాలని చూస్తున్న ట్రోలర్స్‌కు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?