ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ కు మరో అరుదైన గౌరవం లభించింది. పంజాబ్ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్ ను నియమించింది పంజాబ్ ప్రభుత్వం. ఈ మేరకు పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ ట్వీట్ చేశారు. “నటుడు సోనూసూద్ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు. ఈ విషయం ప్రకటించడం సంతోషంగా ఉంది. ఆయన సపోర్ట్ కు ధన్యవాదాలు. ప్రతి ఒక్క పంజాబీ కరోనా వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. కరోనా నుంచి సురక్షితంగా ఉండాలి” అని పంజాబ్ సీఎం ట్వీట్ చేశారు. అయితే సోనూసూద్ సొంత రాష్ట్రమే పంజాబ్. సోనూ సూద్ స్వస్థలం పంజాబ్ లోని మోగా. కాగా కరోనా కష్టకాలంలో వలస కార్మికులకు ఆయన చేసిన సాయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆయన కష్టం అన్నవారికి కాదనకుండా ఆపన్నహస్తం అందిస్తుండడం అభినందనీయం.
సోనూసూద్ కు మరో అరుదైన గౌరవం
