NTV Telugu Site icon

Puhspa 2 : ఓవర్సీస్ లో రికార్డుల రప్ప రప్పా చేస్తున్న పుష్ప రాజ్

Pushpa2 (5)

Pushpa2 (5)

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, సుకుమార్‌ ల ‘పుష్ప-2’ . ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్స్ తో డిసెంబరు 4న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. మొదట ఆట నుండి హిట్ టాక్ తెచ్చుకున్న పుష్ప మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 294 కోట్లు రాబట్టి ఇండియాస్ బిగ్గెస్ట్ డే – 1 రికార్డు ను తన పేరిట నమోదు చేసింది పుష్ప -2. తెలుగు రాష్ట్రాల్లో నంబర్స్ ఆల్ టైమ్ హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది పుష్ప.

Also Read : Pushpa 2 : నార్త్ లో మాస్ బ్యాటింగ్ చేస్తున్న బన్నీ బాబు..

ఇక ఓవర్సీస్ లో పుష్ప రికార్డు స్థాయి ఓపెనింగ్ అందుకుది. నార్త్ అమెరికాలో కేవలం అడ్వాన్స్ సేల్స్ లో 3.33 మిలియన్ రాబట్టి ఆల్ టైమ్ హయ్యెస్ట్ అడ్వాన్స్ సేల్స్ రాబట్టిన 3వ సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక రిలీజ్ రోజు 1.1 మిలియన్ కొల్లగొటట్టింది పుష్ప -2. రెండు రోజులకు గాను 6.3 మిలియన్ రాబట్టిన ఈ సినిమా మూడవ రోజు మార్నింగ్ షోస్ నాటికి 6.3 మిలియన్ దాటి సాయంత్రం షోస్ నాటికి 6.5  మిలియన్ కలెక్ట్ చేస్తూ ఎండ్ ఆఫ్ ది డే 7 మిలియన్ రాబట్టింది. ఇలా గంట గంటకు కలెక్షన్స్ పెరుగుతూ వెళ్తూ సరికొత్త మైలురాయుని అందుకుంటుంది పుష్ప-2. ఇక అదే జోష్ లో కొనసాగుతూ ఇప్పటికి 8 మిలియన్ చేరుకుంది పుష్ప. ఇక వరల్డ్ వైడ్ గా రూ. 500 దాటి వెయ్యి కోట్ల దిశగా పరిగెడుతోంది పుష్ప. నేడు వీకెండ్ తో భారీ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ అంచనా వేస్తుంది.

Show comments