NTV Telugu Site icon

Prudhvi Raj: అందరికీ క్షమాపణలు.. బాయ్ కాట్ కాదు వెల్కమ్ లైలా అనండి!

Laila Pruthvi

Laila Pruthvi

విశ్వక్ సేన్ హీరోగా లైలా అనే సినిమా రూపొందింది. బట్టల రామస్వామి బయోపిక్ అనే సినిమా గతంలో డైరెక్ట్ చేసిన రామ్ నారాయణ ఈ లైలా సినిమా డైరెక్టర్ చేశాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో విశ్వక్సేన్ లేడీ గెటప్ లో నటించడం గమనార్హం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు పృథ్వీరాజ్ కామెంట్స్ ఇప్పుడు వైసీపీ అభిమానులకు కోపం తెప్పించాయి. తాను ఈ సినిమాలో మేకల సత్తి అనే క్యారెక్టర్ చేశానని సినిమా ప్రారంభమైనప్పుడు మొత్తం 150 వరకు మేకలు ఉండేవి కానీ పూర్తయ్యే సమయానికి 11 మేకలు అయ్యాయి. ఇది యాదృచ్ఛికమో లేక కాకతాళీయమో ఏమో తెలియదు అంటూ పృథ్వీరాజ్ కామెంట్ చేశాడు.

Lavanya: రాజ్ తరుణ్ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలి అని ఉంది!

ఆయన అప్పటి వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఇలా కామెంట్ చేశాడంటూ వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో ఫైర్ అవుతూ బాయ్ కాట్ లైలా అనే హ్యాష్ ట్యాగ్ని కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. ఈ తలనొప్పితో విశ్వక్సేన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు కోరాడు. తరువాత పృథ్వి రాజ్ హైబీపీ వచ్చి ఆసుపత్రి పాలు కాగా తాజాగా ఆయన కోలుకుని తనని ఇబ్బంది పెడుతున్న వైసిపీ సోషల్ మీడియా టీం మీద ఫిర్యాదు చేశాడు. ఇక తాజాగా ఈ అంశంలో నటుడు పృథ్వీ క్షమాపణలు చెప్పాడు. వ్యక్తిగతంగా నాకు ఎవ్వరి మీద ద్వేషం లేదు అని పేర్కొన్న ఆయన నా వల్ల సినిమా దెబ్బతిన కూడదు అందరికీ క్షమాపణలు చెపుతున్నానని అన్నారు. బాయ్ కాట్ లైలా అనకుండా వెల్కమ్ లైలా అని అనండి అని కోరారు. ఫలక్ నామాదాస్ కంటే లైలా పెద్ద హిట్ కావాలి అని ఆయన ఆకాంక్షించాడు.