Site icon NTV Telugu

Prudhvi Raj: 1800 కాల్స్..సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశా!

Prudhvi Raj

Prudhvi Raj

తాను ఒక నటుడిగా సినిమా ఫంక్షన్ వేదిక పై మాట్లాడిన మాటలను వైసీపీ సోషల్ మీడియా టార్గెట్ చేశాయని నటుడు 30 ఇయర్స్ పృథ్వీ రాజ్ అన్నారు. 11 అనే నెంబర్ ని చూస్తే చాలు వైసీపీ వాళ్లు గడగడ వణికి పోతున్నారు. నేను ఎవరిని ఉద్దేశించి ఆ మాటలు మాట్లాడలేదన్న ఆయన అక్కడికి వచ్చిన ప్రేక్షకులను నవ్వించడానికే అలా మాట్లాడానని అన్నారు. కానీ అది వైసీపీకి అన్వయిస్తూ ప్రచారం చేసుకున్నారని అన్నారు. గత రెండు రోజులుగా తనను సోషల్ మీడియాలో తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నారని, నా ఫోన్ నెంబర్ వైసీపీ సోషల్ మీడియా గ్రూప్ లో పెట్టి సుమారు 1800 కాల్స్ చేయించారని అన్నారు.

Bulli Raju Father: మాకు రాజకీయాలు అంట కట్టొద్దు.. ఆ అకౌంట్లు మావి కాదు!

ఈ క్రమంలో నా భార్యను , తల్లిని , పిల్లలను తిట్టించారని పేర్కొన ఆయన వారి వేధిపులకు తాను హాస్పిటల్ లో జాయిన్ అయ్యానని అన్నారు. అనిల్ అనే పేరుతో పోస్టులు పెట్టిన వ్యక్తిపై ఆధారాలతో సహా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆయన అన్నారు. ఇక ఏపీ హోంమంత్రి ను కలిసి వారిపై త్వరలో ఫిర్యాదు చేస్తానని పేర్కొన్న ఆయన వేధించిన వారిపై కోటి రూపాయల పరువు నష్టం దావా వేస్తానని ఆయన అన్నారు.

Exit mobile version