NTV Telugu Site icon

Prudhvi Raj: వైసీపీ అభిమానులపై ల’కారాలతో రెచ్చిపోయిన పృథ్వి రాజ్

Prudhviraj

Prudhviraj

30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ మరోసారి వైసిపి సానుభూతిపరుల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇటీవల లైలా అనే సినిమా ఈవెంట్లో ఆయన మేకల గురించి ప్రస్తావిస్తూ ఒకప్పుడు 150 ఉండేవి కానీ ఇప్పుడు 11 మాత్రమే ఉన్నాయి అంటూ సినిమాలో తన క్యారెక్టర్ గురించి కామెంట్లు చేశాడు. అయితే ఆయన వైసిపి ఎమ్మెల్యేలు గురించి కామెంట్ చేశాడు అంటూ వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున టార్గెట్ చేసింది. దీంతో బాయ్ కాట్ ట్రెండ్ తెరమీదకి రావడంతో సినిమా హీరో సహా నిర్మాత మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు అడిగిన పరిస్థితి కనిపించింది. అయితే తాజాగా ఈ వివాదానికి కారణమైన పృథ్వీరాజ్ ఆసుపత్రి పాలయ్యాడు. ఆయన ఆసుపత్రిలో జాయిన్ అయిన తర్వాత ఒక ఛానల్ తో మాట్లాడుతూ వైసీపీ అభిమానుల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు.

Vishwak Sen: మిడిల్ ఫింగర్ వివాదంలో విశ్వక్.. నేను ప్రతిసారి తగ్గను?

వైసీపీ అభిమానులు మనుషులు కాదని వాళ్లు పందులకు పుట్టారేమో అంటూ ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తనకు సుమారు 400 మంది ఫోన్ కాల్స్ చేశారని వారందరి ఫోన్లు రికార్డు చేశానని అన్నారు అవి పోలీసులకు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కి అందించి వారి మీద ఫిర్యాదు చేస్తానని అన్నారు. నా తల్లిని తిట్టారు, ఆమె బ్రతికి ఉంటే అలా తిట్టిన వాడిని నరికేసే వాడిని కానీ ఆమె చనిపోయింది. ఆమె ఆత్మకు కూడా శాంతి లేకుండా చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని లం***కులు అని పిలవాలేమో అంటూ ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. నిజానికి సినిమాని సినిమాగా చూడాలని పేర్కొన్న ఆయన మా అసిస్టెంట్ పదో, 11 మేకలు మాత్రమే మిగిలి ఉన్నాయి అనడంతో సరదాకి మాట్లాడిన మాటలు అవి. అయినా వైసీపీ సోషల్ మీడియా టీంకి 11 అంటే వణుకు వస్తోంది అందుకే వారు నన్ను టార్గెట్ చేశారు అంటూ ఈ సందర్భంగా పృథ్వీరాజ్ కామెంట్ చేశాడు.