సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రజలకు, సెలెబ్రెటీలకు మధ్య దూరం తగ్గిపోయింది. ఈ సోషల్ మీడియా టెక్నాలజీ పుణ్యమా అని పలువురు నెటిజన్లు తమ అభిమాన సెలెబ్రిటీలతో టచ్ లో ఉండగలుగుతున్నారు. అయితే ఈ టెక్నాలజీని కొందరు మాత్రం తప్పుగా ఉపయోగిస్తున్నారు. సెలెబ్రిటీల పేర్లతో నకిలీ ఖాతాలను సృష్టించి వారి అభిమానులను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు విషయంలో కూడా అదే జరిగింది. ఆయన పేరుతో ట్విట్టర్ లో నకిలీ ఖాతాలు ఉన్నట్లు తెలుస్తోంది. అది కాస్తా ఆయన టీం దృష్టికి రావడంతో ఈ విషయంపై ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు. దిల్ రాజుకు ట్విట్టర్ లో ఎలాంటి స్పెషల్ అకౌంట్ లేదని, @SVC_Official అనేది మాత్రమే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు అధికారిక ట్విట్టర్ అకౌంట్ అని ప్రకటించారు.
Read Also : ఆసక్తిని రేకెత్తిస్తున్న “కోల్డ్ కేస్” ట్రైలర్
ఇక ఈ స్టార్ ప్రొడ్యూసర్ ప్రస్తుతం వరుస హిట్లతోనే కాదు వరుస సినిమాలతోనూ బిజీగా ఉన్నారు. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలనే కోరికను “వకీల్ సాబ్” బ్లాక్ బస్టర్ హిట్ తో నెరవేర్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన పలువురు స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే పనిలో ఉన్నారు. ఇప్పుడు ఆయన నిర్మించబోయే చిత్రాల జాబితాలో ఎఫ్3, థాంక్యూ, ఐకాన్, ఆర్సి 15, తలపతి 66 వంటి భారీ బడ్జెట్ మూవీస్ ఉన్నాయి.
