NTV Telugu Site icon

Dil Raju: కేటీఆర్ వ్యాఖ్యలు చాలా బాధాకరం.. దిల్ రాజు కీలక వ్యాఖ్యలు

Dil Raju Counter To Ktr

Dil Raju Counter To Ktr

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారితో జరిగిన తెలుగు చిత్ర పరిశ్రమ సమావేశంపై మాజీ మంత్రి కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం అని ప్రముఖ నిర్మాత, FDC చైర్మన్ దిల్ రాజు అన్నారు. ఈ మేరకు FDC చైర్మన్ హోదాలో ఆయన ఒక లేఖ విడుదల చేశారు. సీఎంతో జరిగిన సమావేశం ఒకరిద్దరితో చాటుమాటున జరిగిన వ్యవహారం కాదని అందరికీ తెలిసిందేనని ఆయన అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ బాగోగుల గురించి అత్యంత స్నేహపూర్వకంగా, ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగిన ఈ సమావేశం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ చాలా సంతృప్తిగా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పయనంలో తెలుగు చిత్ర పరిశ్రమ భాగస్వామ్యాన్ని గుర్తించి.. రాష్ట్రాభివృద్ధికి, సామాజిక సంక్షేమానికి, మా బాధ్యతగా తగిన సహకారం అందజేయాలని సీఎం కాంక్షించారని దిల్ రాజు అన్నారు.

May 2024 Movie Roundup: పద్మవిభూషణ్ చిరంజీవి.. అల్లు అర్జున్ కు సత్కారం

హైదరాబాదును గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా తీర్చదిద్దాలనే సీఎం రేవంత్ బలమైన సంకల్పాన్ని, తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతినిధులుగా మేమందరం స్వాగతించడం జరిగిందని అన్నారు. అనవసర వివాదాల్లోకి తెలుగు చిత్ర పరిశ్రమను లాగి, పరిశ్రమకు లేనిపోని రాజకీయాలను ఆపాదించొద్దని మా మనవి అని దిల్ రాజు అన్నారు. రాజకీయ దాడి, ప్రతిదాడులకు దయచేసి పరిశ్రమను వాడుకోవద్దని అందరిని కోరుతున్నాం అని దిల్ రాజు కోరారు. లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమకు అన్ని ప్రభుత్వాల సహకారం, ప్రజలందరి ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నామని దిల్ రాజు అన్నారు.

Show comments