ఆవేదన: గూగుల్ సీఈవోపై నిర్మాత బన్నీ వాసు ప్రశ్నల వర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాధ్యతలేని ఇంటర్నెట్ భావ ప్రకటనా స్వేచ్ఛ వల్ల ఎంతో మానసిక క్షోభను అనుభవించాను అంటూ నిర్మాత బన్నీ వాసు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కు లేఖ రాశారు. సోషల్ మీడియాలో జరుగుతోన్న తప్పుడు ప్రచారంపై లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తన కూతురిని చంపుతానని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. ఆ వీడియోను తొలగించడానికి నానా కష్టాలు పడ్డానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలాసార్లు ఆయా సామాజిక మాధ్యమాల సంస్థలకు ఫిర్యాదులు చేశానని లేఖలో పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎవరో ఒకరు పెట్టిన సమాచారం అబద్ధమని నిరూపించడం చాలా కష్టమని బన్నీ వాసు లేఖలో తెలియజేశారు.
సోషల్ మీడియాలో ఉంటున్న వాళ్లందరూ విచక్షణతో ఉంటున్నారా? అంటూ ప్రశ్నలు కురిపించారు. ఇటీవల సుందర్‌పిచాయ్ ఇంటర్నెట్ స్వేచ్ఛ మీద రాసిన ఆర్టికల్‌పై.. తన అభిప్రాయాన్ని బన్నీ వాసు ఈ లేఖలో ప్రస్తావించాడు. ఒకరు ఈ సమాచారం తప్పు అని నిరూపించి దానినుంచి బయటకు రావటానికి జీవితం మొత్తం అయిపోతుందన్నారు.
Also Read
‘ఎంత మంది అమ్మాయిల నగ్న చిత్రాలు ఇంటర్నెట్లో వాళ్ళ ప్రమేయంలేకుండా అప్ లోడ్ చేయబడి వాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నాయో రోజు చూస్తూనే ఉన్నాము. ఎంతోమంది ఆరాచకులు వాళ్ళ వాంఛలు తీర్చకపోతే మార్ఫింగ్ చేసిన ఫోటోలను సామజిక మాధ్యమాలలో ప్రచురిస్తాం అని బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకున్న తరుణాలు కోకొల్లలు’ అంటూ బన్నీ వాసు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
తాజావార్తలు
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి