గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఫుల్ వైట్ అండ్ వైట్ డ్రెస్ లో అద్భుతమైన లుక్ లో దర్శనమిచ్చింది. లండన్లో చాలా కాలం గడిపి తాజాగా యుఎస్ తిరిగి వచ్చిన ప్రియాంక ఇప్పుడు పలు ప్రాజెక్ట్ లతో చాలా బిజీగా ఉంది. రెస్ట్ లేకుండా పని చేస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం కొంత విరామం తీసుకోవాలని భావించి న్యూయార్క్ లోని తన ఫ్యామిలీని చేరింది. అక్కడ తన ప్రియమైనవారితో సమయం గడపడంలో బిజీగా ఉంది. ఈ వీకెండ్ లో ఆమె మొదటిసారి న్యూయార్క్‌లోని తన సొంత రెస్టారెంట్ సోనాకు వెళ్ళింది. ఆ సమయంలో ప్రియాంక ధరించిన ఆల్-వైట్ సూపర్ చిక్ లుక్ కు సంబంధించిన పిక్స్ ఆకట్టుకుంటున్నాయి.
Read Also : 7 రొటీన్ స్టెప్స్ తో గ్లాస్ స్కిన్ గ్లో…!
జూన్ ప్రపంచవ్యాప్తంగా ‘ప్రైడ్’ మంత్’గా గుర్తించారు. ఈ సందర్భంగా ప్రియాంక ఆల్ వైట్ స్లిట్ స్కర్ట్, పుల్ ఓవర్ స్వీటర్ ధరించి తన అభిమానులకు ‘హ్యాపీ ప్రైడ్’ శుభాకాంక్షలు తెలిపింది. ఇక ఈ వైట్ అవుట్ ఫిట్ కు మ్యాచింగ్ గా బంగారు రంగు యాక్సెసరీ ధరించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ కొత్త లుక్ కు సంబంధించి వరుస పిక్స్ షేర్ చేసింది. ఈ పిక్స్ చూస్తుంటే ఆమె కుటుంబ సభ్యులతో అద్భుతమైన సమయాన్ని స్పెండ్ చేసినట్లు కన్పిస్తోంది.
