NTV Telugu Site icon

సూర్య స‌ర‌స‌న ఆధినిగా ప్రియాంక‌!

త‌మిళ స్టార్ హీరో సూర్య ఇటు సినిమాల‌తోనే కాదు అటు వెబ్ సీరిస్ తోనూ బిజీబిజీగా ఉన్నాడు. వేట్రి మార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వాదివాస‌ల్ మూవీలో న‌టించ‌బోతున్న సూర్య‌, సైమ‌ల్టేనియ‌స్ గా పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వం ఇక పేరు నిర్ణ‌యించ‌ని సినిమాలో న‌టిస్తున్నాడు. కోలీవుడ్ లోకి శివ‌కార్తికేయ‌న్ డాక్ట‌ర్ మూవీలో ఎంట్రీ ఇస్తున్న ప్రియాంక అరుల్ మోహ‌న్ ఇందులో నాయిక‌గా న‌టిస్తోంది. ఇటీవ‌ల ఈ చిత్ర దర్శ‌కుడు పాండిరాజ్ పుట్టిన రోజు సంద‌ర్బంగా సూర్య మూవీకి సంబంధించిన కొన్ని అంశాల‌ను అభిమానుల ముందుకు వ‌చ్చాయి. ప్రియాంక ద‌ర్శ‌కుడు పాండిరాజ్ కు బ‌ర్త్ డే విషెస్ తెలియ‌చేయ‌గానే థ్యాంక్యూ ఆధినీ అంటూ ఆయ‌న బ‌దులిచ్చాడు. అలానే ఇటీవ‌ల ఓ చిత్రంలో హీరోగా న‌టించిన క‌మెడియన్ సూరి సైతం ద‌ర్శ‌కుడికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్ప‌గానే అత‌ని పాత్ర పేరైన ఆవ‌ని సూల‌మ‌ణి అని సంభోదిస్తూ జ‌వాబిచ్చాడు పాండిరాజ్. అలానే సూర్య‌- పాండిరాజ్ కాంబో రాబోతున్న ఈ సినిమాకు డి. ఇమాన్ సంగీతం అందిస్తున్నాడు. క‌రోనా స‌మ‌యంలోనే సూర్య న‌టించిన ఆకాశం నీ హ‌ద్దురా ఓటీటీ ద్వారా విడుద‌లై విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది.